Cameron Green: మా టీమ్‌తోపాటు ఫైనలిస్ట్‌ చెన్నై స్ట్రాంగ్‌ కాదు.. నా ఛాయిస్‌ మాత్రం అదే: గ్రీన్‌

గత రెండు మ్యాచుల్లో ముంబయి ఇండియన్స్‌ (MI) విజయం సాధించడంలో కామెరూన్‌ గ్రీన్‌దే (Cameron Green) కీలక పాత్ర. నేడు గుజరాత్‌ టైటాన్స్‌తో రెండో క్వాలిఫయర్‌లోతలపడేందుకు ముంబయి సిద్ధమైంది. ఈ క్రమంలో పలు విషయాలపై గ్రీన్‌ స్పందించాడు.

Published : 26 May 2023 17:32 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 2023 సీజన్‌ (IPL 2023) ముంబయి ఆడిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సెంచరీతో అదరగొట్టిన కామెరూన్‌ గ్రీన్‌.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లోనూ లఖ్‌నవూపై విలువైన 40 పరుగులు చేశాడు. అదేవిధంగా లఖ్‌నవూ ఆలౌట్‌ కావడంలో కీలకమైన రనౌట్లలోనూ భాగస్వామి కావడం విశేషం. నేడు గుజరాత్‌ టైటాన్స్‌తో ముంబయి ఇండియన్స్‌ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమవుతోంది. మరోసారి కామెరూన్‌ గ్రీన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ క్రమంలో ‘అత్యుత్తమ జట్టు’ను ఎంపిక చేసిన గ్రీన్‌.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబయిని కానీ, ఫైనల్‌కు చేరిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ను కానీ ఎంచుకోకపోవడం గమనార్హం. 

నెమ్మదిగా ఆరంభం..

భారత కెప్టెన్‌గా, ఐపీఎల్‌లో ఐదు సార్లు ముంబయిని ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మకు చాలా అనుభవం ఉంది. ముంబయి తమ తొలి మ్యాచ్‌లో ఎప్పుడూ విజయం సాధించలేదని రోహిత్ అంటుండేవాడు. మేం ఈసారి చాలా నెమ్మదిగా టోర్నీని ప్రారంభించాం. అయితే, కీలక సమయంలో దూసుకొచ్చాం.

సూర్యతో ఈజీ

సూర్యకుమార్‌తో బ్యాటింగ్‌ చేయడం అద్భుతంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అలవోకగా బ్యాటింగ్ చేస్తాడు. మనం చేయాల్సిందల్లా అతడికి స్ట్రైకింగ్‌ ఇవ్వడమే. అదే మా ప్రణాళిక. ఏదైనా తేలికైన బంతి వస్తేనే దానిని భారీగా హిట్‌ చేయాలి. లేకపోతే సూర్యకు బ్యాటింగ్‌ వచ్చేలా చేస్తే ఎలాంటి బంతినైనా స్వేచ్ఛగా ఆడేస్తాడు.

ఆ రెండూ కాదు

అత్యుత్తమ ఆటగాళ్లపరంగా గుజరాత్‌ టైటాన్స్‌ బలమైన జట్టు. అన్ని విభాగాల్లోనూ కీలక ప్లేయర్లు ఆ టీమ్‌ సొంతం. క్వాలిఫయర్‌లో చెన్నై చేతిలో ఓడిపోయినప్పటికీ గుజరాత్‌ను తక్కువగా అంచనా వేయలేం. ఓపెనర్లు, స్పిన్‌ ద్వయం గుజరాత్‌కు రక్షణ కవచంగా ఉంటారు. వారిది బలమైన జట్టు అయినా మేం విజయం కోసం చివరి వరకు పోరాడుతాం’’ అని కామెరూన్ గ్రీన్‌ తెలిపాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు