Hardik Pandya : హార్దిక్ గొప్ప బౌలరే.. కానీ మూడో సీమర్‌గా వద్దు: టీమ్ఇండియా మాజీ ఆటగాడు
ఆసియా కప్ సూపర్-4 తొలి పోరులో పాకిస్థాన్‌పై ఓటమి నుంచి భారత ఆటగాళ్లు పాఠాలు నేర్చుకోవాలని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్‌తోపాటు ...
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ సూపర్-4 తొలి పోరులో పాకిస్థాన్‌పై ఓటమి నుంచి భారత ఆటగాళ్లు పాఠాలు నేర్చుకోవాలని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించాడు.ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్‌తోపాటు మూడో సీమర్‌గా హార్దిక్ పాండ్య బౌలింగ్ వేశాడు. నాలుగు ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే తీశాడు. అయితే గ్రూప్ స్టేజ్‌లో పాక్‌పైనే హార్దిక్ (3/25) సూపర్‌గా బౌలింగ్ వేశాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యను నమ్మకమైన మూడో పేసర్‌గా పరిగణనలోకి తీసుకోవచ్చా..? అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే సంజయ్ మంజ్రేకర్ మాత్రం హార్దిక్‌ను మూడో పేసర్‌గా కాకుండా.. నాలుగో ఫాస్ట్ బౌలర్‌గా ఎంపిక చేసుకోవాలని సూచించాడు.
‘‘పాక్‌తో మ్యాచ్ నుంచి చాలా పాఠాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మ్యాచ్ సందర్భంగా రోహిత్‌కు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఒకవేళ మేనేజ్మెంట్ ముగ్గురు మీడియం పేసర్లతో బరిలోకి దిగాలనుకుంటే.. ఆ ముగ్గురిలో హార్దిక్ పాండ్యను లెక్కలోకి తీసుకోకూడదు. హార్దిక్ పాండ్య గొప్ప బౌలరే అయినప్పటికీ నాలుగో సీమర్గానే పరిగణించాలి. ఎందుకంటే హార్దిక్ బౌలర్‌గా విఫలమైనప్పుడు ఆ ఓవర్ల కోటాను వేరే బౌలర్ పంచుకునే అవకాశం కల్పించాలి. లేకపోతే పాక్‌తో జరిగినట్లే ఇబ్బందిపడాల్సి ఉంటుంది. బౌలింగ్ సరిగా లేనప్పుడు హార్దిక్‌ను రెండు ఓవర్లతోనే ఆపేయాలి. అప్పుడు జట్టుకూ, అతడికి ప్రయోజనం ఉంటుంది’’ అని మంజ్రేకర్ వివరించాడు. సూపర్-4లో భాగంగా ఇవాళ శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇప్పటికే అఫ్గాన్‌పై విజయం సాధించిన లంకను ఎదుర్కోవడం తేలికైన విషయమేమీ కాదని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!