Beijing Olympics: అమెరికా.. ఆస్ట్రేలియా.. బ్రిటన్‌.. ఇప్పుడు కెనడా!

చైనా రాజధాని బీజింగ్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న శీతాకాల ఒలింపిక్స్‌ను అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ దేశాలు దౌత్యపరంగా బహిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశాల బాటలోనే కెనడా కూడా నడుస్తోంది. అమెరికాలాగే తాము కూడా బీజింగ్ ఒలింపిక్స్‌ను బహిష్కరిస్తున్నట్లు తాజాగా కెనడా ప్రధాన

Updated : 09 Dec 2021 15:31 IST

టొరంటో: చైనా రాజధాని బీజింగ్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న శీతాకాల ఒలింపిక్స్‌ను అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ దేశాలు దౌత్యపరంగా బహిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశాల బాటలోనే కెనడా కూడా నడుస్తోంది. అమెరికాలాగే తాము కూడా బీజింగ్ ఒలింపిక్స్‌ను బహిష్కరిస్తున్నట్లు తాజాగా కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో ప్రకటించారు.

‘చైనా ప్రభుత్వం మానవ హక్కులను పదే పదే ఉల్లంఘిస్తోంది. ఈ విషయలో మేమంతా ఆందోళన చెందుతున్నాం. అందుకే బీజింగ్‌ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నాం. మా దేశం నుంచి దౌత్యవేత్తలను ఒలింపిక్స్‌ క్రీడావేడుకలకు పంపించకూడదని నిర్ణయం తీసుకున్నాం’’అని ప్రధాని వెల్లడించారు. అయితే, కెనడా అథ్లెట్లు మాత్రం ఈ క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. మరికొన్ని దేశాలు సైతం బీజింగ్‌ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరించే యోచనలో ఉన్నాయి.

బీజింగ్‌ ఒలింపిక్స్‌ 2022 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు జరగనున్నాయి. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచమంతా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ శీతాకాల ఒలింపిక్స్‌ నిర్వహణ కోసం చైనా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. క్లోజ్డ్ లూప్ సిస్టమ్‌తో అథ్లెట్లు సురక్షితంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తాము సిద్ధంగా ఉన్నామని, ఒలింపిక్స్‌ క్రీడలను ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహిస్తామని ఒలింపిక్స్‌ కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని