Hyderabad: అజారుద్దీన్‌, హెచ్‌సీఏ నిర్వాహకులపై బేగంపేట పీఎస్‌లో ఫిర్యాదు

హైదరాబాద్‌లో జరగనున్న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య టీ-20 మ్యాచ్‌ టికెట్ల విక్రయం అంశంలో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొక్కిసలాటకు హెచ్‌సీఏ నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అజారుద్దీన్‌, హెచ్‌సీఏ సభ్యులపై బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated : 23 Sep 2022 04:08 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో జరగనున్న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య టీ-20 మ్యాచ్‌ టికెట్ల విక్రయం అంశంలో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొక్కిసలాటకు హెచ్‌సీఏ నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అజారుద్దీన్‌, హెచ్‌సీఏ సభ్యులపై బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. టికెట్లను బ్లాక్‌లో అమ్మారని బాధితులు ఆరోపించారు. ఈ మేరకు అజారుద్దీన్‌, హెచ్‌సీఏ నిర్వాహకులపై పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. 

ఈనెల 25న ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో టికెట్ల విక్రయాలకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఏర్పాట్లు  చేసిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో టికెట్లు విక్రయించాలని నిర్ణయించారు. మ్యాచ్‌ టికెట్ల కోసం వేకువజాము నుంచే అభిమానులు బారులు తీరారు. టికెట్ల విక్రయం కోసం ప్యారడైజ్‌ కూడలి నుంచి జింఖానా వరకు అభిమానులు క్యూకట్టారు.

అంచనాలకు మించి అభిమానులు రావడంతో వాళ్లను నియంత్రించేందుకు పోలీసులు అవస్థలు పడ్డారు. మెయిన్‌ గేట్‌ వైపు నుంచి ఒక్కసారిగా తోసుకుని రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈక్రమంలో లాఠీఛార్జ్‌ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మందికి పైగా అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు.  పలువురు గాయపడ్డారు. గాయాలపాలైన వారిలో యువతులు కూడా ఉన్నారు. 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని