Published : 07 Jun 2022 02:06 IST

Casper Ruud: రఫా.. నీ చేతిలో ఓడితే ఎలా ఉంటుందో తెలిసింది: కాస్పర్‌ రూడ్

ఇంటర్నెట్‌డెస్క్‌: టెన్నిస్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌ చేతిలో ఓడితే ఎలా ఉంటుందో తెలిసిందని ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనలిస్ట్‌ కాస్పర్‌ రూడ్‌ అన్నాడు. ఆదివారం జరిగిన తుదిపోరులో ఎప్పటిలాగే నాదల్‌ తన ఆధిపత్యం చలాయించాడు. తనకు అచ్చొచ్చిన ఎర్రమట్టి కోటలో మరో టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. దీంతో కెరీర్‌లో మొత్తం 22 గ్రాండ్‌స్లామ్‌లు సాధించి తన మేటి రికార్డును తానే బద్దలుకొట్టాడు. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో నాదల్‌ 6-3, 6-3, 6-0 తేడాతో గెలుపొందాడు. ఈ నేపథ్యంలోనే ఓటమిపాలైన అనంతరం కాస్పర్‌ స్పందిస్తూ.. నాదల్‌ను ఇలా మెచ్చుకున్నాడు.

‘నాదల్‌ నువ్వో నిజమైన ఛాంపియన్‌వి. నీతో నాకు ఇదే తొలిసారి పోటీ. నీ చేతిలో ఓటమిపాలవ్వడం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసింది. నువ్వు నన్ను ఎలాంటి కల్మషం లేకుండా మనసారా నీ అకాడమీలో చేర్చుకున్నావు. నాకు నిజమైన స్ఫూర్తిగా నిలిచావు. నువ్వు మరింత కాలం ఆడాలని మేమంతా కోరుకుంటున్నాం.’ అని కాస్పర్‌ చెప్పుకొచ్చాడు. దీంతో అతడు అభిమానుల మన్ననలు పొందాడు. కాగా, ఇది నాదల్‌కు 14వ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ కావడం విశేషం. ఈ టోర్నీలో అతడన్ని టైటిళ్లు ఎవరూ దక్కించుకోలేదు. మరోవైపు 36 ఏళ్ల వయసులో రొలాండ్‌ గారోస్‌లో టైటిల్‌ నెగ్గిన అతి పెద్ద వయస్కుడిగానూ నాదల్‌ ఘనత సాధించాడు. జకోవిచ్‌, రోజర్‌ ఫెదరర్‌ చెరో 20 టైటిళ్లతో సమానంగా ఉన్నారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని