Tokyo Olympics: రజతం తెచ్చిన రవికి హరియాణా ప్రభుత్వం ఏమిస్తుందంటే!

టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన రెజ్లర్‌ రవి కుమార్‌ దహియాకు హరియాణా రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటించింది. తమ రాష్ట్రానికి చెందిన రవి రజతం గెలించిన సందర్భంగా అతడికి రూ. 4కోట్లు నగదు బహుమతి, క్లాస్‌ 1 కేటగిరిలో ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో

Updated : 07 Aug 2021 09:35 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన రెజ్లర్‌ రవి కుమార్‌ దహియాకు హరియాణా రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటించింది. తమ రాష్ట్రానికి చెందిన రవి కుమార్‌ రజతం గెలిచిన సందర్భంగా అతడికి రూ. 4కోట్లు నగదు బహుమతి, క్లాస్‌ 1 కేటగిరిలో ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా.. రవికి 50శాతం రాయితీతో ప్లాట్‌ను ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే, రవి స్వగ్రామం నాహ్రీలో రెజ్లింగ్‌ శిక్షణ కోసం ఇండోర్‌ స్టేడియం నిర్మించనున్నట్లు హరియాణా ప్రభుత్వం పేర్కొంది.

రజత పతక విజేతపై ప్రశంసల వర్షం!

రెజ్లింగ్‌లో రజత పతకం సాధించిన రవి కుమార్‌ దహియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రవిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. అతడిని చూసి దేశం గర్విస్తోందని కొనియాడారు. క్లిష్టమైన పరిస్థితుల్లో బౌట్స్‌కు వచ్చి అసలైన ఛాంపియన్‌గా నిలిచావని రాష్ట్రపతి ప్రశంసించారు. రవి కుమార్‌ దహియా ఒక అద్భుతమైన రెజ్లర్‌ అని ప్రధాని అన్నారు. అతడి స్ఫూర్తిదాయక ప్రదర్శన ఎంతో గొప్పగా ఉందని పేర్కొన్నారు. రజతం గెలిచినందుకు రవికి అభినందలు తెలుపుతూ ప్రముఖులంతా ట్వీట్లు చేస్తున్నారు. 






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని