Sports Budget : ‘ఖేలో ఇండియా’కు పెరిగిన బడ్జెట్.. గతేడాది కంటే రూ. 300 కోట్లు అధికం

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఖేలో ఇండియా కార్యక్రమం కోసం...

Published : 01 Feb 2022 23:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: క్రీడా రంగానికి ఈసారి బడ్జెట్‌ కేటాయింపులు పెరిగాయి. టోక్యోలో భారత్‌ పతకాలు సాధించిన నేపథ్యంలో గతంతో పోలిస్తే 305.58 కోట్లు అధికంగా కేంద్రం కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.3062.60 కోట్లు కేటాయింపులు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. గతేడాది క్రీడా రంగానికి కేంద్రం రూ.2,757 కోట్లు కేటాయించింది.

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఖేలో ఇండియా కార్యక్రమం కోసం గతేడాది కంటే ఈసారి రూ.316 కోట్లను ఎక్కువగా కేటాయించింది. గతేడాది ఖేలో ఇండియా కోసం రూ. 657.71 కోట్లను కేటాయించగా.. ఈ సారి దానిని రూ.970 కోట్లకు పెంచింది. అలానే క్రీడాకారులకు బహుమతిగా ఇచ్చే నజరానాలు, అవార్డుల కోసం రూ.357 కోట్లను ప్రత్యేకించింది. గతేడాది ఈ మొత్తం రూ.245 కోట్లుగా ఉంది. అయితే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్‌) బడ్జెట్‌ను రూ.7.41 కోట్లు తగ్గించి రూ. 653 కోట్లకు పరిమితం చేసింది. జాతీయ క్రీడాభివృద్ధి నిధిని కూడా రూ.9 కోట్లు తగ్గించి రూ.16 కోట్లను (గతేడాది రూ. 25 కోట్లు) మాత్రమే కేటాయించింది. నేషనల్‌ సర్వీస్‌ స్కీమ్‌ కోసం రూ.118.50  కోట్లను అదనంగా కేటాయించి.. ఆ మొత్తాన్ని రూ.283.50 కోట్లకు చేర్చింది. క్రీడాకారులకు ఇన్సెంటివ్స్ కోసం రూ.55 కోట్లు, జాతీయ స్పోర్ట్స్ ఫెడరేషన్స్‌ (ఎన్‌ఎస్‌ఎఫ్‌ఎస్)కు రూ.280 కోట్ల నిధులను కేంద్రం బడ్జెట్‌లో కేటాయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని