ఏడుగురు క్రీడాకారులకు పద్మశ్రీ

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలను సోమవారం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘పద్మ’ అవార్డుల జాబితాను విడుదల చేసింది. 2021 సంవత్సరానికి గాను ఏడుగురికి పద్మవిభూషణ్‌...

Updated : 25 Jan 2021 22:42 IST

ఇంటర్నెట్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలను సోమవారం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘పద్మ’ అవార్డుల జాబితాను విడుదల చేసింది. 2021 సంవత్సరానికి గాను ఏడుగురికి పద్మవిభూషణ్‌, 10 మందికి పద్మభూషణ్‌, 102 మంది పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. కాగా, క్రీడా విభాగంలో ఏడుగురికి పద్మశ్రీ అవార్డు లభించింది.

అవార్డు గ్రహీతలు

పీ అనిత (తమిళనాడు), మౌమా దాస్‌ (పశ్చిమబెంగాల్‌), అన్షు జంసేన్సా (అరుణాచల్‌ప్రదేశ్‌), మాధవన్‌ నంబియార్‌ (కేరళ), సుధా హరినారయణ్‌ సింగ్‌ (ఉత్తరప్రదేశ్‌), వీరేంద్ర సింగ్‌ (హరియాణా), కే.వై వెంకటేశ్‌ (కర్ణాటక)

ఇవీ చదవండి 
ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్‌
కర్నల్‌ సంతోష్‌బాబుకు ‘మహావీరచక్ర’ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని