Published : 18 Aug 2022 18:18 IST

Chahal-Dhanashree: చాహల్‌, ధనశ్రీ విడిపోతున్నారా.. ఆ పోస్టుల వెనుక అర్థమేంటీ?

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (DhanaShree Verma) జంటకు సోషల్‌మీడియాలో మంచి క్రేజ్‌ ఉంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ షేర్‌ చేస్తూ రొమాంటిక్‌ జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా వీరు సోషల్‌మీడియాలో పెట్టిన పోస్టులు అభిమానులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. చాహల్‌, ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారేమోనన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అసలేం జరిగిందంటే..

చాహల్‌ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. అందులో ‘కొత్త జీవితం మొదలవుతోంది (New Life Loading..)’ అని రాసి ఉంది. దీంతో ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ధనశ్రీ తల్లికాబోతుందేమో.. చాహల్‌ త్వరలోనే శుభవార్త చెప్పనున్నారంటూ అభిమానులు భావించారు. అయితే అదే సమయంలో చాహల్‌ సతీమణి ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చాహల్‌ పేరును తొలగించడంతో గందరగోళం మొదలైంది.

పెళ్లి తర్వాత ధనశ్రీ వర్మ చాహల్‌గా ఉన్న పేరును ఇప్పుడు ఆమె ధనశ్రీ వర్మగా మార్చుకుంది. నిజానికి చాహల్‌ పోస్ట్‌ కంటే ముందే ఆమె తన పేరులో నుంచి చాహల్‌ పదాన్ని తొలగించుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, నిన్న ఆమె ఓ ఫొటోను షేర్ చేస్తూ ‘‘యువరాణి తన బాధను కూడా శక్తిగా మార్చుకుంటుంది’’ అని రాసుకొచ్చింది. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. చాహల్‌ జంట మధ్య బంధం సరిగా లేదంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే వీటిపై ఇటు చాహల్‌.. అటు ధనశ్రీ స్పందించలేదు.

ముంబయికి చెందిన డెంటిస్ట్‌, కొరియోగ్రాఫర్‌ అయిన ధనశ్రీ వద్ద చాహల్‌ డ్యాన్స్‌ క్లాసులకు వెళ్లాడు. ఆ పరిచయం ప్రేమగా మారి 2020 డిసెంబరులో వీరిద్దరూ గురుగ్రామ్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన వీడియోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఇటీవల జరిగిన టీ20 మెగా టోర్నీలోనూ చాహల్‌ ఆడే మ్యాచ్‌లకు ధనశ్రీ వచ్చి గ్యాలరీ నుంచి ఉత్సాహపర్చింది. ఆ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది కూడా. అయితే కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇక, కెరీర్‌ పరంగా చాహల్‌ త్వరలోనే ఆసియా కప్‌ 2022 టోర్నీలో ఆడనున్నాడు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని