Ban vs Ind: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌

బంగ్లాదేశ్‌, భారత్‌ మధ్య డిసెంబర్‌ 14 నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌ల కోసం ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించగా.. తాజాగా స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.

Updated : 11 Dec 2022 20:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బంగ్లాదేశ్‌, భారత్‌ మధ్య డిసెంబర్‌ 14 నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌ల కోసం ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించగా.. తాజాగా స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం కారణంగా కెప్టెన్‌ రోహిత్ శర్మ సిరీస్‌కు దూరం కావడంతో సారథ్య బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించారు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది. మొదటి టెస్టు కోసం రోహిత్‌ స్థానంలో ఇండియా- ఎ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్‌ జట్టులోకి రానున్నాడు. భుజం గాయం నుంచి మహ్మద్‌ షమీ, మెకాలి గాయం నుంచి రవీంద్ర జడేజా పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో ఈ సిరీస్‌కు దూరమయ్యారు. వారి స్థానంలో నవదీప్‌ సైనీ, సౌరభ్‌ కుమార్‌లను జట్టులోకి ఎంపిక చేశారు.  కెరీర్‌లో ఏకైక టెస్టు (2010లో సౌతాఫ్రికా) ఆడిన ఫాస్ట్‌బౌలర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌కు కూడా ఈ సిరీస్‌కు కోసం సెలక్టర్ల నుంచి పిలుపొచ్చింది.  

మార్పుల అనంతరం భారత జట్టు ఇదే..:

కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్, ఛతేశ్వర్‌ పూజారా (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్ (వికెట్‌ కీపర్‌), కేఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్ యాదవ్‌, అభిమన్యు ఈశ్వరన్‌, నవ్‌దీప్‌ సైని, సౌరభ్‌ కుమార్‌, జయదేవ్‌ ఉనద్కత్‌.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని