Deepak Chahar : టీ20 లీగ్‌.. చెన్నైకి బిగ్‌ షాక్‌.. దీపక్‌ చాహర్‌ ఔట్!

 టీ20 లీగ్‌లో ఇప్పటికే వరుసగా నాలుగు పరాజయాలతో....

Updated : 12 Apr 2022 16:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 లీగ్‌లో ఇప్పటికే వరుసగా నాలుగు పరాజయాలతో అట్టడుగు స్థానంలో ఉన్న చెన్నైకి గట్టి షాక్‌ తగిలింది. భారీ మొత్తం (రూ. 14 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసిన ఆల్‌రౌండర్‌ దీపక్‌ చాహర్‌ ఈ సీజన్‌కు పూర్తిగా దూరం కానున్నాడు. వెన్ను నొప్పి కారణంగా తొలి నాలుగు మ్యాచ్‌లకు దూరమైన చాహర్‌.. మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని లీగ్‌ వర్గాలు పేర్కొన్నాయి. అయితే చెన్నై యాజమాన్యం మాత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ప్రస్తుతం దీపక్‌ చాహర్ జాతీయ క్రికెట్ అకాడమీ పర్యవేక్షణలో ఉంటున్నాడు. దాదాపు నెల రోజుల నుంచి ఎన్‌సీఏలోనే ఉంటున్నట్లు క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో దీపక్‌ గాయపడిన విషయం తెలిసిందే. గాయం నుంచి కోలుకుని కనీసం ఏప్రిల్‌లోనైనా అందుబాటులో ఉంటాడని చెన్నై జట్టు యాజమాన్యం భావించింది. అయితే గాయం పూర్తిగా మానకపోవడంతో ఈ సీజన్‌ను దీపక్‌ చాహర్‌ మిస్‌ అయినట్లేనని సమాచారం. బెంగళూరుతో ఇవాళ చెన్నై తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పాయింట్ల ఖాతా తెరవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు