
Chennai vs Hyderabad: మళ్లీ ఓడిన హైదరాబాద్
వరుసగా రెండో ఓటమి
చెన్నైకి మూడో విజయం
మెరిసిన రుతురాజ్, కాన్వే
విజృంభించిన ముకేశ్
బుల్లెట్ లాంటి బంతులతో గత మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన చేసిన ఉమ్రాన్ తేలిపోయాడు.. భువనేశ్వర్ పరుగులు కట్టడి చేసినా వికెట్ తీయలేకపోయాడు.. గాయంతో వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే మైదానం వీడాడు.. వెరసి బౌలింగ్‌లో హైదరాబాద్ వైఫల్యం. ఓపెనర్లు రుతురాజ్, కాన్వే అద్భుత బ్యాటింగ్‌తోచెన్నైకిభారీ స్కోరు అందిస్తే.. బ్యాటింగ్‌లోనూ విఫలమైన హైదరాబాద్ వరుసగా రెండో ఓటమి ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్‌లో కెప్టెన్‌గా ధోని తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని అందుకున్నాడు. తొమ్మిది మ్యాచ్‌ల్లో చెన్నైకిది మూడో గెలుపు.
పుణె: వరుసగా అయిదు విజయాలతో జోరు మీద కనిపించిన హైదరాబాద్ మళ్లీ పరాజయాల బాటలో సాగుతోంది. ఆదివారం ఆ జట్టు 13 పరుగుల తేడాతో చెన్నై చేతిలో ఓడింది. మొదట చెన్నై 20 ఓవర్లలో 2 వికెట్లకు 202 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (99; 57 బంతుల్లో 6×4, 6×6), డెవాన్ కాన్వే (85 నాటౌట్; 55 బంతుల్లో 8×4, 4×6) చెలరేగారు. తొలి వికెట్‌కు 182 పరుగులు జోడించి జట్టుకు భారీస్కోరు అందించారు. ప్రత్యర్థి బౌలర్లలో నటరాజన్ (2/42) ఆకట్టుకున్నాడు. భువనేశ్వర్ (0/22) పరుగులు కట్టడి చేశాడు. ఛేదనలో హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 189 పరుగులు చేసింది. పూరన్ (64 నాటౌట్; 33 బంతుల్లో 3×4, 6×6), విలియమ్సన్ (47; 37 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి (4/46) సత్తాచాటాడు.
ఆరంభం మాత్రమే..: ఛేదనను హైదరాబాద్ దూకుడుగా ఆరంభించింది. మంచి ఫామ్‌లో ఉన్న అభిషేక్ (39)తో పాటు విలియమ్సన్ కూడా చెలరేగడంతో ఆ జట్టు 5 ఓవర్లకే 52/0తో నిలిచింది. కానీ ఆ తర్వాతి ఓవర్లోనే ముకేశ్ వరుస బంతుల్లో అభిషేక్, రాహుల్ త్రిపాఠి (0)ని ఔట్ చేసి ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. అంతకుముందు ఇన్నింగ్స్ మూడో ఓవర్లో శాంట్నర్ (1/36) బౌలింగ్‌లో అభిషేక్ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్‌ను వదిలేసిన ముకేశ్.. తన బౌలింగ్‌లో అతణ్ని ఔట్ చేసి లెక్క సరిచేశాడు. ఆ వెంటనే జడేజా (0/15) బౌలింగ్‌లో విలియమ్సన్ క్యాచ్‌ను ధోని పట్టలేకపోయాడు. వికెట్లు పడడంతో పరుగుల వేగం మందగించింది. శాంట్నర్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో జోరు ప్రదర్శించిన మార్‌క్రమ్ (17).. ఆ తర్వాతి బంతికే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి జడేజా చేతికి చిక్కాడు. దీంతో 10 ఓవర్లకు స్కోరు 89/3. విలియమ్సన్, పూరన్ సిక్సర్లతో ఆశలు నిలిపే ప్రయత్నం చేశారు. కానీ కీలక దశలో విలియమ్సన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న ప్రిటోరియస్ (1/40) హైదరాబాద్‌కు షాకిచ్చాడు. తీక్షణ (0/26) 16వ ఓవర్లో నాలుగు పరుగులే ఇవ్వడంతో.. హైదరాబాద్ విజయ సమీకరణం 4 ఓవర్లలో 68 పరుగులుగా మారి క్లిష్టంగా కనిపించింది. పూరన్ క్రీజులో ఉన్నా.. సాధించాల్సిన రన్‌రేట్ 20 దాటడంతో హైదరాబాద్ ఆశలకు తెరపడింది. ముకేశ్ మరోసారి ఒకే ఓవర్లో శశాంక్ (15), వాషింగ్టన్ సుందర్ (2)ను పెవిలియన్ చేర్చడంతో ఆ జట్టు పనైపోయింది. చివరి ఓవర్లో వరుసగా 6, 4తో పూరన్ అర్ధశతకాన్ని అందుకున్నాడు. ఆ ఓవర్లో అతను ఇంకో రెండు సిక్సర్లు బాదినా ఫలితం లేకుండా పోయింది.
ఓపెనర్లు అదరహో..: అంతకుముందు ఓపెనర్లు రుతురాజ్, కాన్వే ఈ సీజన్‌లోనే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేశారు. రెండు సిక్సర్లతో రుతురాజ్ వేగం ప్రదర్శించినా.. మరో ఎండ్‌లో కాన్వే పరుగుల కోసం కష్టపడడంతో ఆరు ఓవర్లకు చెన్నై 40/0తో నిలిచింది. అక్కడి నుంచి ఇన్నింగ్స్ ఊపందుకుంది. బుల్లెట్ లాంటి బంతులతో వికెట్ల వేటలో దూసుకెళ్తోన్న ఉమ్రాన్ (0/48)ను లక్ష్యంగా చేసుకుని రుతురాజ్ అలవోకగా బౌండరీలు రాబట్టాడు. కాన్వే కూడా జోరందుకున్నాడు. మార్‌క్రమ్ బౌలింగ్‌లో రుతురాజ్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 11 ఓవర్లకే జట్టు స్కోరు వందకు చేరింది. ఉమ్రాన్‌ను మాత్రం వదలకుండా.. సిక్సర్లు కొట్టడం ఇంత సులువా? అనేలా రుతురాజ్ రెచ్చిపోయాడు. కవర్ డ్రైవ్‌లు, కట్ షాట్లు, లాఫ్టెడ్ షాట్లు.. ఇలా అతని బ్యాటింగ్ సాగింది. మరోవైపు జాన్సన్ (0/38) బౌలింగ్‌లో సిక్సర్‌తో అర్ధశతకం చేరుకున్న కాన్వే కూడా తానేం తక్కువ కాదన్నట్లు విరుచుకుపడ్డాడు. చూస్తుండగానే 90లో అడుగుపెట్టిన రుతురాజ్.. సెంచరీకి చేరువయ్యే క్రమంలో ఒత్తిడికి గురయ్యాడు. శతకానికి ఒక్క పరుగు దూరంలో నటరాజన్ బౌలింగ్‌లో ఔటై నిరాశగా వెనుదిరిగాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఓ ఫోర్ కొట్టిన ధోనీ (8)ని చివరి ఓవర్లో నటరాజన్ ఔట్ చేశాడు. ఆ ఓవర్లో కాన్వే రెండు ఫోర్లు కొట్టడంతో స్కోరు 200 దాటింది.
154
ఈ మ్యాచ్‌లో రెండు సార్లు బంతిని గంటకు 154 కిలోమీటర్ల వేగంతో వేసిన ఉమ్రాన్.. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ అత్యధిక వేగం నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు.
182
ఈ టీ20 మెగా లీగ్ చరిత్రలో చెన్నైకిదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. గత రికార్డు వాట్సన్, డుప్లెసిస్ (2020లో పంజాబ్‌పై అజేయంగా 181) జోడీపై ఉంది. మరోవైపు ఎంసీఏ స్టేడియంలో టీ20 లీగ్‌లో తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం ఇదే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
-
India News
Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
-
Viral-videos News
Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
-
India News
Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాల కేసులో షార్ప్‌షూటర్ అరెస్టు
-
Sports News
IND vs ENG: శ్రేయస్‌ను తెలివిగా బుట్టలో వేసిన ఇంగ్లాండ్.. వీడియో చూడండి
-
Movies News
Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- IND vs ENG: నాలుగో రోజు ముగిసిన ఆట.. భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సిందే!
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
- Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
- Tamil Nadu: తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి.. సంచలన వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ
- News In Pics: చిత్రం చెప్పే సంగతులు