ధోనీ×కోహ్లీ: బ్యాటింగ్‌ ఎంచుకున్న విరాట్‌

యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న టీ20 లీగులో మరో రసవత్తర పోరుకు వేళైంది. దుబాయ్‌ వేదికగా మూడుసార్లు ఛాంపియన్‌ చెన్నై, ఇప్పటి వరకు కప్‌ గెలవని బెంగళూరు తలపడుతున్నాయి. ఈ రెండు జట్ల సారథులకు అశేషమైన అభిమాన గణం ఉండటంతో మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి....

Updated : 10 Oct 2020 19:08 IST

దుబాయ్‌: యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న టీ20 లీగులో మరో రసవత్తర పోరుకు వేళైంది. దుబాయ్‌ వేదికగా మూడుసార్లు ఛాంపియన్‌ చెన్నై, ఇప్పటి వరకు కప్‌ గెలవని బెంగళూరు తలపడుతున్నాయి. ఈ రెండు జట్ల సారథులకు అశేషమైన అభిమాన గణం ఉండటంతో మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాస్‌ గెలిచిన బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. పెద్ద బౌండరీలు కావడంతో ఇక్కడ లక్ష్యాన్ని కాపాడుకోవడం సులువన్నది విశ్లేషకుల మాట. ఈ మ్యాచులో విజయం సాధించడం రెండు జట్లకూ అత్యంత అవసరం.

బెంగళూరు జట్టు: దేవదత్‌ పడిక్కల్‌, ఆరోన్‌ ఫించ్‌, విరాట్‌  కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, గురుకీరత్‌ సింగ్‌, శివమ్‌ దూబె, క్రిస్‌ మోరిస్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఉదాన, నవదీప్‌ సైని, యుజువేంద్ర చాహల్‌

చెన్నై జట్టు: షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోనీ, జగదీశన్‌,  సామ్‌ కరన్‌, రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రావో, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, కర్ణ్ శర్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని