IPL Final: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా.. మే 29న మ్యాచ్ నిర్వహణ
ఐపీఎల్-16 సీజన్ ఫైనల్ వర్షం కారణంగా వాయిదా పడింది. మ్యాచ్‌ను రిజర్వ్ డే (మే 29న) నిర్వహించాలని నిర్ణయించారు.
అహ్మదాబాద్: చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్-16 సీజన్ ఫైనల్ వర్షం కారణంగా వాయిదా పడింది. టాస్ పడకముందు నుంచే నరేంద్ర మోదీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం మొదలైంది. అప్పుడప్పుడు వరుణుడు కాస్త శాంతించినట్టు కనిపించాడు. అయితే మ్యాచ్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా.. తిరిగి వర్షం మొదలైంది. తర్వాత వర్షం తగ్గకపోగా మరింత ఎక్కువైంది. దీంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని నిర్వాహకులు తేల్చారు. రిజర్వ్ డేగా ఉన్న మే 29న ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహిస్తామని ప్రకటించారు.
మరోవైపు రిజర్వ్ డే రోజున (మే 29న) కూడా అహ్మదాబాద్‌లో వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరగాలని కోరుకుంటున్నారు. అదీ కూడా సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ ద్వారానైనా మ్యాచ్ ఫలితం తేలాలనుకుంటున్నారు. రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ జరగకపోతే లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును ఛాంపియన్‌గా ప్రకటిస్తారు. అలా జరిగితే 14 మ్యాచ్‌ల్లో 10 విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్‌గా నిలుస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: ఆర్చరీలో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో భారత్ ‘పతకాల’ రికార్డ్
-
Stock Market: కొనసాగుతున్న నష్టాల పరంపర.. 19,400 దిగువకు నిఫ్టీ
-
AP BJP: ‘పవన్’ ప్రకటనలపై ఏం చేద్దాం!
-
Floods: సిక్కింలో మెరుపు వరదలు.. 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
YSRCP: వైకాపా జిల్లా అధ్యక్షుల మార్పు