Published : 04 Dec 2021 01:19 IST

IPL: అతడిని వేలంలో దక్కించుకోవాలనుకుంటున్నాం : సీఎస్కే యాజమాన్యం

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) విజయాల్లో కీలకంగా వ్యవహరించిన దక్షిణాఫ్రికా ఆటగాడు డు ప్లెసిస్‌ను త్వరలో నిర్వహించనున్న మెగా వేలంలో సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లు ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్‌ తెలిపాడు. గత ఐపీఎల్ సీజన్‌లో డు ప్లెసిస్‌ ఆడిన 16 మ్యాచుల్లో 633 పరుగులు చేశాడు. ఇప్పటికే, చెన్నై యాజమాన్యం ఆల్ రౌండర్‌ రవీంద్ర జడేజా (రూ.16 కోట్లు), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (రూ.12 కోట్లు), మొయిన్‌ అలీ (రూ.8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్‌ (రూ.6 కోట్లు) రిటెయిన్ చేసుకున్న విషయం తెలిసిందే.

‘గత సీజన్‌లో చెన్నై ఫైనల్‌కి చేరుకోవడంలో డుప్లెసిస్‌ కీలకంగా వ్యవహరించాడు. జట్టు కోసం అతడు చాలా కష్టపడ్డాడు. వచ్చే సీజన్‌కి కూడా అతడిని వేలం ద్వారా దక్కించుకోవాలనుకుంటున్నాం. చెన్నైలోని చెపాక్‌ స్టేడియం మాకు బాగా అచ్చొచ్చింది. సొంత మైదానంలో సీఎస్కే అభిమానుల కోలాహలం మధ్య మ్యాచుల నిర్వహించాలనుకుంటున్నాం. వచ్చే సీజన్‌లో స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోతుందనుకుంటున్నాను. చెన్నై జట్టుకు ధోని పెద్ద దిక్కు. కెప్టెన్‌గా జట్టు కోసం చేయాల్సిందంతా చేశాడు. క్రికెట్లో అతడికున్న అపార అనుభవం మాకు కలిసొస్తుంది. అతడి నాయకత్వంపై సందేహం అక్కర్లేదు. ఎంతటి కఠిన పరిస్థితుల్లోనైనా జట్టును గొప్పగా ముందుకు నడిపించగలడు. వచ్చే సీజన్‌లో కూడా మెరుగ్గా రాణించాలనుకుంటున్నాం’ అని కాశీ విశ్వనాథన్‌ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని