IPL-CSK: ముఖేశ్ చౌదరి ఔట్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌లోకి కొత్త పేసర్‌

గతేడాది ఐపీఎల్‌లో అదరగొట్టిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫాస్ట్‌బౌలర్‌ ముఖేశ్‌ చౌదరి (Mukesh Choudhary) కాలి గాయం కారణంగా ఈ సీజన్‌కు (IPL-16) పూర్తిగా దూరమయ్యాడు. అతడి స్థానంలో రూ.20 లక్షలకు ఆకాశ్‌ సింగ్‌ను జట్టులోకి తీసుకుంది సీఎస్కే.

Published : 31 Mar 2023 00:41 IST

 

ఇంటర్నెట్ డెస్క్: గతేడాది ఐపీఎల్‌లో అదరగొట్టిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) ఫాస్ట్‌బౌలర్‌ ముఖేశ్‌ చౌదరి (Mukesh Choudhary) గాయం కారణంగా ఈ సీజన్‌కు (IPL-16) పూర్తిగా దూరమయ్యాడు. అతడి స్థానంలో రూ.20 లక్షలకు ఆకాశ్‌ సింగ్‌ (Akash Singh) ను జట్టులోకి తీసుకుంది సీఎస్కే. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ట్వీట్‌ చేసింది. 2020 అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టులో ఆకాశ్‌ సింగ్‌ సభ్యుడిగా ఉన్నాడు. ఈ 20 ఏళ్ల ఫాస్ట్‌బౌలర్‌ ఇంతకుముందు రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడాడు. గతేడాది ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన ముఖేశ్‌.. దీపక్‌ చాహర్‌ లేని లోటును భర్తీ చేశాడు. 13 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు సాధించాడు. ఇప్పుడు ఆ బౌలర్‌ దూరం కావడం చెన్నై సూపర్‌ కింగ్స్‌కు గట్టిదెబ్బే. మార్చి 31న చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్ టైటాన్స్‌ మ్యాచ్‌తో ఐపీఎల్‌-16 సీజన్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. గతేడాది పేలవ ఆటతీరుతో పాయింట్ల పట్టికలో దిగువ నుంచి రెండో స్థానంలో నిలిచిన సీఎస్కే ఈ సారి మెరుగ్గా ఆడి మరోసారి ఛాంపియన్‌గా నిలవాలని భావిస్తోంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇప్పటివరకు నాలుగుసార్లు విజేతగా నిలిచింది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని