టీమిండియా క్రికెటర్‌ చేతన్‌ చౌహాన్‌ కన్నుమూత

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ చేతన్‌ చౌహాన్‌ (73) కన్నుమూశారు. శరీరంలో వివిధ అవయవాలు విఫలం కావడంతో ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. కొవిడ్‌-19 సోకడంతో జులై 12న ఆయన లఖ్‌నవూలోని సంజయ్‌గాంధీ ....

Updated : 21 Aug 2020 15:18 IST

కొవిడ్‌-19తో శారీరక అవయవాలు వైఫల్యం

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టీమిండియా మాజీ క్రికెటర్‌ చేతన్‌ చౌహాన్‌ (73) కన్నుమూశారు. శరీరంలో కొన్ని అవయవాలు విఫలం కావడంతో ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. కొవిడ్‌-19 సోకడంతో జులై 12న ఆయన లఖ్‌నవూలోని సంజయ్‌గాంధీ పీజీఐ ఆస్పత్రిలో చేరారు. కొన్నేళ్లుగా జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్నారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలకు తోడుగా కరోనా వైరస్‌ సోకడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మూత్రపిండాలు వైఫల్యం చెందడంతో శనివారం ప్రాణవాయువు సాయంతో ఆయనకు చికిత్స అందించారు.

1947, జులై 21న జన్మించిన చేతన్‌ చౌహాన్‌ భారత జట్టు ఓపెనర్‌గా అందరికీ సుపరిచితమే. దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌కు సుదీర్ఘకాలం ఓపెనింగ్‌ భాగస్వామిగా ఆయన ఉన్నారు. 40 టెస్టులు ఆడారు. మహారాష్ట్ర, దిల్లీ తరఫున రంజీల్లో ఆడారు. దిల్లీ క్రికెట్‌ సంఘంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి పదవుల్లో కొనసాగారు. దిల్లీ ప్రధాన సెలక్టర్‌గా సేవలు అందించారు. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఆయన భారత జట్టు మేనేజర్‌గానూ పనిచేశారు. నిఫ్ట్‌ ఛైర్మన్‌గానూ ఉన్నారు. రాజకీయాల్లోనూ ఆయన‌ రాణించడం గమనార్హం. యూపీలోని అమ్రోహా నుంచి 1991, 1998లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లోనూ చురుకైన పాత్ర పోషించారు. 2018, ఆగస్టు వరకు ఉత్తర్‌ ప్రదేశ్‌ క్రీడామంత్రిగా పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు