టెస్టుల్లో ఆడటమే నా  అంతిమ లక్ష్యం: సకారియా

జులైలో టీమ్‌ఇండియా శ్రీలంకలో పర్యటించనుంది. ఇందు కోసం బీసీసీఐ గురువారం 20 మంది ఆటగాళ్లతోపాటు ఐదుగురు నెట్‌ బౌలర్లను ఎంపిక చేసింది. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ తరఫున ఆడి రాణించిన  యువ

Published : 11 Jun 2021 22:25 IST

(photo:Chetan Sakaria Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: జులైలో టీమ్‌ఇండియా శ్రీలంకలో పర్యటించనుంది. ఇందు కోసం బీసీసీఐ గురువారం 20 మంది ఆటగాళ్లతోపాటు ఐదుగురు నెట్‌ బౌలర్లను ఎంపిక చేసింది. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ తరఫున ఆడి రాణించిన యువ క్రికెటర్‌ చేతన్‌ సకారియా ఈ పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే, టీమ్‌ఇండియా తరఫున టెస్టు క్రికెట్‌ ఆడటం తన అంతిమ లక్ష్యమని సకారియా పేర్కొన్నాడు.

‘నా అంతిమ లక్ష్యం భారత్‌ తరఫున టెస్టు క్రికెట్ ఆడటం. సుదీర్ఘ కాలం టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటున్నా. టెస్టు క్రికెట్ జీవితంలాంటిది. ఇది నిజమైన సవాళ్లను విసురుతుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు నా ఆలోచన ధోరణిని మార్చివేసింది. ఆ జట్టులోని ఉన్న  ప్రపంచస్థాయి అత్యుత్తమ ఆటగాళ్లకు బౌలింగ్ చేయడం నాలో నమ్మకాన్నిచ్చింది. నా ప్రణాళికలను ఎలా అమలు చేయాలో నేర్చుకున్నాను’ అని సకారియా అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని