Team India: స్వదేశానికి టీమ్ఇండియా.. భారత స్టార్లు బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తిన్నారంటే?

టీ20 ప్రపంచ కప్‌ సాధించిన టీమ్ఇండియా స్వదేశానికి చేరుకుంది. గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో దిల్లీకి చేరుకున్నారు. 

Updated : 04 Jul 2024 17:24 IST

ఇంటర్నెట్ డెస్క్: 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్‌ఇండియా గురువారం స్వదేశంలో అడుగుపెట్టింది. జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది ప్రత్యేక విమానంలో ఉదయం దిల్లీకి చేరుకున్నారు. అనంతరం రోహిత్‌ సేన ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా చాణక్యపురిలోని ఐటీసీ మౌర్య హోటల్‌కు వెళ్లింది. అక్కడ హోటల్ సిబ్బంది టీమ్ఇండియాకు ఘన స్వాగతం పలికారు. భారత ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా రుచికరమైన అల్పాహారాన్ని సిద్ధం చేసి వడ్డించారు. బ్రేక్‌ఫాస్ట్‌లో బఫెట్‌లో స్థానికంగా లభించే తాజా సీజనల్‌ పండ్లను కూడా ఉంచారు.

కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు ముంబయి స్టైల్‌ వడాపావ్‌ (Vada pav) వడ్డించగా.. విరాట్ కోహ్లీ (Virat Kohli)కి అమృత్‌సర్‌ స్టైల్‌ చోలే బటూరే’ (Chole Bhature)ని అల్పాహారంగా అందించారు. అంతేకాకుండా ఆటగాళ్లు తినడానికి వారి గదుల్లో చేతితో చుట్టిన చాక్లెట్ ట్రఫుల్ రోల్స్ ఉంచారు. క్రికెట్‌ను ప్రతిబించేలా చాక్లెట్‌తో బాల్స్‌, బ్యాట్స్‌, పిచ్‌ను తయారుచేశారు. 

ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికి హోటల్‌ నుంచి బయలుదేరే ముందు టీమ్‌ఇండియా ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన కేక్‌ని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కోచ్‌ రాహుల్ ద్రవిడ్ లు కట్‌ చేశారు. ఈ కేక్‌పై టీ20 వరల్డ్ కప్‌ ట్రోఫీ నమునా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం భారత జట్టు ముంబయికి వెళ్లింది. సాయంత్రం 5 గంటలకు రోడ్‌షో, అనంతరం వాంఖడే వేదికగా సన్మానం జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని