chris gayle:గర్బా స్టెప్పులేసిన క్రిస్‌ గేల్‌: వీడియో

వీరేంద్ర సెహ్వాగ్‌ సారథ్యంలోని గుజరాత్‌ జెయింట్స్‌ జట్టు జోధ్‌పుర్‌లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా క్రిస్‌ గేల్‌ గుజరాతీ అతిథి మర్యాదలను ఆస్వాదిస్తున్నాడు.

Published : 03 Oct 2022 01:26 IST

దిల్లీ: లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీ 2022 సీజన్‌ చివరి మ్యాచ్‌ కోసం యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరేంద్ర సెహ్వాగ్‌ సారథ్యంలోని గుజరాత్‌ జెయింట్స్‌ జట్టు జోధ్‌పుర్‌లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా గేల్‌ గుజరాతీ అతిథి మర్యాదలను ఆస్వాదిస్తున్నాడు. దసరా నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో శనివారం పాల్గొన్నాడు. గర్బా స్టెప్పులేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు.  ఈ వీడియోను గుజరాత్‌ టీమ్‌ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. క్రీజులో ఎప్పుడూ చెమటలు కక్కుతూ కనిపించే ఈ ఆటగాడు ఇందులో సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయాడు. ఈ పోస్ట్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని