Mirabai Chanu: మీరా... నీ నిర్విరామ కృషికి సెల్యూట్‌!

టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో రజతం సాధించిన  మీరాభాయి చానుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ సాధారణ కుటుంబంలో జన్మించి.. భారత్‌ కీర్తిని రెపరెపలాడించిన ఈ మణిపూర్‌ మణిపూసను వేయినోళ్లా పొగడ్తలు ముంచెత్తుతున్నాయి....

Updated : 24 Jul 2021 19:28 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో రజతం సాధించిన  మీరాభాయి చానుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ సాధారణ కుటుంబంలో జన్మించి.. భారత్‌ కీర్తిని రెపరెపలాడించిన ఈ మణిపూర్‌ మణిపూసను వేనోళ్లా పొగడ్తలు ముంచెత్తుతున్నాయి. దాదాపు 21 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాభాయ్‌ చాను అద్భుతం సృష్టించింది. 49 కిలోల విభాగంలో రజతం గెలుపొందింది. స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలు.. మొత్తం 202 కిలోలు ఎత్తింది. పలువురు ప్రముఖులు ఆమెను ప్రశంసిస్తున్నారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.

 

* మీరాబాయి చాను.. వెయిట్‌ లిఫ్టింగ్‌ ప్రదర్శన మహాఅద్భుతం. గాయాలపాలైనప్పటికీ, అకుంఠిత సాధనతో  రజత పతకం సాధించడం కచ్చితంగా అద్భుతమే. భారత్‌ గర్వపడేలా చేశావ్‌.

 - సచిన్‌ తెందూల్కర్‌

* మీరాబాయి చానుకు అభినందనలు. టోక్యో ఒలింపిక్స్‌లో మన దేశానికి తొలి పతకం తీసుకొచ్చింది.. సెల్యూట్‌

- శిఖర్ ధావన్‌

* టోక్యో ఒలింపిక్స్‌లో మా ప్రచారం వినూత్నంగా మొదలైంది. దేశం యావత్తు గర్వించ దగ్గ సమయం. రజతం సాధించిన మీరాబాయి చానుకు అభినందనలు.

- మిథాలీ రాజ్‌

మనసు ఉప్పొంగింది

-వీరేంద్ర సెహ్వాగ్‌

* అభినందనలు మీరాబాయి చాను. భారత్‌ తరఫున టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించి..గర్వించేలా చేశావ్‌

-సూర్యకుమార్‌  యాదవ్‌

* కోట్లాది మంది నిరీక్షణలను, ఆశల్ని ఎత్తావు. టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల 49 కేజీల విభాగంలో రజతం సాధించిన మీరాబాయి చానుకు అభినందనలు.

-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

* అద్భుతం.. టోక్యో ఒలింపిక్స్‌లో టీమిండియాకు ఎంత గొప్ప ప్రారంభం...!

- శ్రేయస్‌ అయ్యర్‌

* బయల్దేరండి.. వేట ఇప్పుడే మొదలైంది. టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌లో రజతం సాధించిన మీరాబాయి చానుకు హృదయపూర్వక అభినందనలు.

- మహేశ్‌బాబు

* టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన ప్రియమైన మీరాబాయి చానుకు అభినందనలు. భారతదేశం గర్వపడేలా చేశావ్‌

- దగ్గుబాటి వెంకటేశ్‌

* టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం. రజతం సాధించిన మీరాబాయి చానుకు అభినందనలు. మేమంతా గర్వపడేలా చేశావ్‌

- తమన్నా

* మీరాబాయి చానుకు అభినందనలు.. ధన్యవాదాలు. మేమంతా గర్వపడేలా చేశావ్‌

- ఈశా రెబ్బా

* రజతం సాధించిన మీరాబాయి చానుకు అభినందనలు. టోక్యో ఒలింపిక్స్‌లో నీది అసాధారణ ప్రదర్శన.

- శ్రేయా ఘోషల్‌

 




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని