INDW vs PAKW : దాయాది దేశాల కీలక పోరు.. గెలిస్తేనే నిలుస్తారు!

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత మహిళల జట్టు మరో సమరానికి సిద్ధమైంది. పాకిస్థాన్‌తో కీలక సమరానికి...

Updated : 31 Jul 2022 16:14 IST

టాస్‌ నెగ్గిన పాక్‌ మహిళల జట్టు

ఇంటర్నెట్ డెస్క్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత మహిళల జట్టు మరో సమరానికి సిద్ధమైంది. పాకిస్థాన్‌తో కీలక సమరానికి ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా నిలిచింది. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన పాక్‌ బ్యాటింగ్‌ ఎంచుకుని భారత్‌కు బౌలింగ్‌ అప్పగించింది. వర్షం అంతరాయం కలిగించడంతో టాస్‌ను దాదాపు గంటపాటు ఆలస్యంగా వేశారు. ఇరు జట్లూ తమ తొలి మ్యాచుల్లో ఓటమిపాలు కావడంతో దాయాదుల పోరు కీలకంగా మారింది. ఆసీస్‌పై అద్భుతంగా ఆడినా చివర్లో చేతులెత్తేయడంతో టీమ్‌ఇండియా ఓడింది. ఇక చిన్న జట్టు బార్బోడస్‌పై పాక్‌ చతికిల పడటం గమనార్హం. సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిందే. అయితే ఇప్పటి వరకు పాక్‌పై భారత్‌దే ఆధిక్యం కాగా.. ఈ మ్యాచ్‌లో ఎవరు నెగ్గుతారో వేచి చూడాలి. వర్షం ఆలస్యం కావడంతో మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు.

జట్ల వివరాలు: 

భారత్‌: స్మృతీ మంధాన, షఫాలీ వర్మ, యస్తికా భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, దీప్తి శర్మ, రాధా యాదవ్, స్నేహ్‌ రాణా, మేఘ్న సింగ్, రేణుక సింగ్

పాకిస్థాన్‌: ఇరామ్‌ జావేద్, మునీబా అలీ, ఒమైమా సోహెల్‌, బిస్మా మరూఫ్‌ (కెప్టెన్‌), అలియా రియాజ్‌, అయేషా నసీమ్, కైనత్‌ ఇంతియాజ్‌, ఫాతిమా సనా, తుబా హస్సన్, డైనా బేగ్, అనమ్ అమిన్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని