
Team India: టీమ్ఇండియా కొత్త డైట్ ప్లాన్‌పై కామెంట్ల జోరు!
ఇంటర్నెట్ డెస్క్: కివీస్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమ్ఇండియా మేనేజ్మెంట్ తీసుకున్న ఓ నిర్ణయం నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. క్రికెటర్ల కోసం వడ్డించే కొత్త ఆహార మెనూపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. క్యాటరింగ్లో హలాల్ మాంసం చేర్చడంపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. బీసీసీఐ రూపొందించిన ఆహార ప్రణాళికలో బీఫ్, పోర్క్ మాంసాలకు చోటు కల్పించలేదు. అయితే మాంసం మాత్రం హలాల్ చేయాలని పేర్కొంది. ఆటగాళ్ల ఫిట్నెస్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనిపైనే నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారులు తమకు ఇష్టమైన ఆహారాన్ని ఎంచుకోకుండా టీమ్ మేనేజ్మెంట్ ఎలా నిరోధిస్తుందని ప్రశ్నించారు.
టీమ్ఇండియా డైట్ ప్లాన్ భారత క్రికెట్ బోర్డు నుంచి రాదు. అయితే జట్టు మేనేజ్మెంటే క్యాటరింగ్ అవసరాలకు సంబంధించి బీసీసీఐకి తెలియజేస్తుంది. బీసీసీఐ కేవలం డైట్ ప్లాన్ మాత్రమే కాకుండా ఆటగాళ్ల భద్రత, లాజిస్టిక్స్ వంటి విషయాలను కూడా చూస్తుంది. తొలి టెస్టు జరిగేది కాన్పూర్‌లో కాబట్టి ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌తో సంప్రదింపులు జరుపుతూ ఉంటుంది. టీమ్ఇండియా జట్టు విదేశాలకు వెళ్లినప్పుడు లేదా ఇత దేశాలు మన దేశానికి వచ్చినప్పుడు డైట్ ప్లాన్‌లో హలాల్ మాంసం ఉండటం సర్వసాధారణం. అలాగే, న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కూడా తమ ఆటగాళ్లకు కావాల్సిన ఆహారానికి సంబంధించి డైట్ ప్లాన్‌ను మ్యాచ్ నిర్వాహకులకు అందజేసింది. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్న నేపథ్యంలో డైట్ ప్లాన్‌పై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.