BCCI: భారత క్రికెటర్ల మెనూపై వివాదం

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా భారత క్రికెటర్ల మెనూపై వివాదం  నెలకొంది. కాన్పూర్‌లో ఆరంభమయ్యే తొలి టెస్టులో భారత క్రికెటర్ల ఆహారంలో పంది, గోవు మాంసాలను నిషేధించడమే కాక..

Updated : 24 Nov 2021 07:38 IST

కాన్పూర్‌:  న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా భారత క్రికెటర్ల మెనూపై వివాదం  నెలకొంది. కాన్పూర్‌లో ఆరంభమయ్యే తొలి టెస్టులో భారత క్రికెటర్ల ఆహారంలో పంది, గోవు మాంసాలను నిషేధించడమే కాక.. హలాల్‌ చేసిన మాంసాన్నే పెట్టబోతున్నట్లు తెలిసింది. బీసీసీఐ అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించకపోయినా.. బోర్డు వర్గాల ద్వారా ఈ సమాచారం బయటకు వచ్చింది. దీంతో హలాల్‌ చేసిన మాంసాన్నే పెట్టడం ఏంటని సామాజిక మాధ్యమాల్లో అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తమకు ఇష్టమైన, నచ్చిన వంటకాన్ని తిననీయకుండా ఆటగాళ్లను ఎలా నిరోధిస్తారని వారు అంటున్నారు. భారత జట్టుతో పాటు న్యూజిలాండ్‌ జట్టులో ముస్లిం ఆటగాళ్లు ఉన్నందువల్ల హలాల్‌ చేసిన మాంసాన్ని అందించాలని బోర్డు భావించినట్లు తెలిసింది. మరోవైపు న్యూజిలాండ్‌ జట్టు కాన్పూర్‌ టెస్టు సందర్భంగా తమకు కావాల్సిన ఆహార ప్రణాళికను ఇప్పటికే బీసీసీఐకి పంపింది. కొవ్వు తక్కువగా ఉండి మాంసకృతులు, కార్బోహైడ్రైట్స్‌ ఉండే ఆహారాన్ని ఇవ్వాల్సిందిగా కోరింది. కొంతమంది క్రికెటర్లకు ఆహారానికి సంబంధించిన అలర్జీలు ఉన్నందున ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని