Covid 19:‘భారత్‌లోని నా మిత్రుల గురించి ఆలోచిస్తున్నా’

దేశం(భారత్)లో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండటంపై ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్ ఆందోళన వ్యక్తం చేశాడు. అద్భుతమైన భారతదేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడం విచారకరమని

Published : 07 May 2021 01:47 IST

ఇంటర్నెట్ డెస్క్: దేశం(భారత్)లో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండటంపై ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్ ఆందోళన వ్యక్తం చేశాడు. అద్భుతమైన భారతదేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడం విచారకరమని పేర్కొన్నాడు. కొవిడ్‌పై భారతదేశం యుద్ధం కొనసాగిస్తున్నందున ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని అందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరాడు.

‘ఈ భయంకరమైన సమయంలో భారత్‌లోని నా స్నేహితుల గురించి ఆలోచిస్తున్నా. దయచేసి మీరు సురక్షితంగా ఉంటూ మీ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోండి. అద్భుతమైన మీ దేశంలో పరిస్థితి చాలా విచారకరంగా ఉంది. భారత్‌కు నా ప్రేమ, మద్దతు ఎల్లవేళలా ఉంటుంది’ అని షేన్‌ వార్న్‌ ట్వీట్ చేశాడు.

దేశంలో గత 24 గంటల్లో 4,12,263 మంది వైరస్‌ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బయో బుడగలో ఉన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వరుసగా కరోనా బారినపడుతుండటంతో ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. 
 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని