Gujarat Titans:గుజరాత్ టైటాన్స్ సక్సెస్ క్రెడిట్ వారికే దక్కుతుంది: అనిల్ కుంబ్లే
గతేడాది ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) వరుసగా రెండో ఏడాది కూడా ఫైనల్స్‌కు చేరింది. గుజరాత్ సక్సెస్ వెనుక కెప్టెన్ హార్దిక్, కోచ్ ఆశిశ్ నెహ్రా కీలక పాత్ర పోషించారని భారత మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఈ సీజన్‌లోనూ అదరగొడుతోంది. క్వాలిఫయర్-2లో ముంబయి ఇండియన్స్‌ను చిత్తు చేసి వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఆడిన మొదటి రెండు సీజన్లలో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. గత సీజన్ మాదిరిగానే ఈ సీజన్‌లోనూ గుజరాత్ టైటాన్స్ మంచి ప్రదర్శన కొనసాగించడంలో కెప్టెన్ హార్దిక్ పాండ్య(Hardik Pandya), కోచ్ ఆశిశ్ నెహ్రా కీలక పాత్ర పోషించారని భారత మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే (Anil Kumble) పేర్కొన్నారు.
‘‘గత సంవత్సరం మాదిరిగానే ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ నిలకడగా ఆడుతోంది. జట్టు సక్సెస్ క్రెడిట్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, కోచ్ ఆశిశ్ నెహ్రాతోపాటు ఆటగాళ్లలందరికీ దక్కుతుంది. ప్లేయర్స్ అందరూ బాగా ఆడారు. ఈ సీజన్‌లో జట్టులోకి వచ్చిన జోష్ లిటిల్, నూర్ అహ్మద్‌లు గుజరాత్‌కు బాగా ఉపయోగపడ్డారు. ఇంపాక్ట్ ప్లేయర్ విధానాన్ని కూడా గుజరాత్ బాగా వినియోగించుకుంది. సాయి సుదర్శన్, విజయ్ శంకర్‌లు తమ పాత్రలకు న్యాయం చేశారు’’ అని అనిల్ కుంబ్లే పేర్కొన్నారు.
ఇక, ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. ఈ టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుంది. క్వాలిఫయర్-1లో సీఎస్కే చేతిలో ఓటమిపాలైన గుజరాత్.. ఫైనల్ గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. సీఎస్కే కెప్టెన్ ధోనీ కూడా తన వ్యూహాలకు మరింత పదునుపెట్టి జట్టుకు ఐదో టైటిల్ అందించడానికి కృషి చేస్తాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Apply Now: ‘సింగిల్ గర్ల్ చైల్డ్’కు సీబీఎస్ఈ స్కాలర్షిప్.. దరఖాస్తు చేశారా?
-
Hyderabad: పాతబస్తీలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి గాయాలు
-
October 1: దేశవ్యాప్తంగా ‘శ్రమదాన్’.. స్వచ్ఛత కోసం మోదీ పిలుపు
-
Rakshit Shetty: తెలుగు ప్రేక్షకుల ఆదరణకు రక్షిత్ శెట్టి ఫిదా.. ఏమన్నారంటే?
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Parineeti-Raghav : ఒక్కటైన ‘రాగ్‌ణీతి’.. లీలా ప్యాలెస్‌లో వైభవంగా వివాహం