WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌ విజేత.. ‘ఏఐ’ ఏం చెప్పిందంటే..?

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో (WTC Final 2023) విజేతగా నిలిచే జట్టు గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికీ తొలి రోజు ఆట మాత్రమే ముగిసింది. ఇవాళ రెండో రోజు ఆట ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే.

Published : 08 Jun 2023 14:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఆస్ట్రేలియా, భారత్‌ జట్ల (AUS vs IND) మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో (WTC Final 2023) విజేత ఎవరు..? ఇప్పుడు కేవలం తొలి రోజు ఆట మాత్రమే ముగిసింది. అయినా, ప్రారంభం నుంచే ఏ జట్టు గెలుస్తుందనే అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌ విజేత గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కూడా అంచనా వేసి వెల్లడించింది. మరి ‘ఏఐ’ ఏం చెప్పిందో ఆసీస్‌ క్రికెటర్ల మాటల్లోనే తెలుసుకుందాం.. ఆ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్టు చేసింది. ‘‘మేం డబ్ల్యూటీసీ ఫైనల్‌ విజేత గురించి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను అడిగాం. ఆ ఫలితం చాలా ఆసక్తికరంగా ఉంది. అదేంటో మీరూ చూసేయండి’’ అని సీఏ పేర్కొంది. ఆ వీడియోలో.. ఏఐ ఫలితాలను ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లైయన్ చదివి వినిపించారు. 

‘‘ఆస్ట్రేలియా, భారత్‌ ఉత్కంఠభరితంగా పోరాడతాయి. అయితే, ఆసీస్‌ భారీ టార్గెట్‌ను ఛేదించి విజేతగా నిలుస్తుంది. బ్యాటింగ్‌ ఆర్డర్‌ రివర్స్‌ అవుతుంది. పోటీని మరింత రసవత్తరంగా మారుస్తుంది’’ - ప్యాట్‌ కమిన్స్‌

‘‘జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లైయన్‌ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. హేజిల్‌ కొన్ని అద్భుతమైన షాట్లు ఆడతాడు. ఛేదనను మరింత సులువు చేస్తాడు. భారత బౌలర్లు మాత్రం తమ రిథమ్‌ను అందిపుచ్చుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడతారు’’ - హేజిల్‌వుడ్‌

‘‘ప్యాట్‌ కమిన్స్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. దూకుడైన ఆటతీరుతో ఆసీస్‌ శిబిరంలో భరోసా కల్పిస్తాడు. ప్రతి షాట్‌తో మ్యాచ్‌ను దగ్గరగా తీసుకొస్తాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సందర్భంలో.. భారత బౌలర్‌ వేసిన ఫుల్‌టాస్‌ను ఆకాశమే హద్దుగా బాదేస్తాడు’’ - కమిన్స్‌

‘‘ఓవల్‌ మైదానం అదిరిపోయింది’’ - నాథన్‌ లైయన్


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు