
IND vs NZ: శ్రేయస్ అయ్యర్‌పై దిగ్గజ క్రికెటర్ల ప్రశంసల వర్షం.!
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అరంగేట్ర టెస్టులోనే శతకం నమోదు చేయడంపై పలువురు దిగ్గజ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ సహా.. కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు శ్రేయస్ అయ్యర్ ఆటతీరును మెచ్చుకుంటూ సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు తెలిపారు. కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టు సందర్భంగా అయ్యర్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఆడుతున్న తొలి టెస్టులోనే శ్రేయస్ (105: 171 బంతుల్లో 13x4, 2x6) శతకంతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
‘టెస్టు కెరీర్‌ను గొప్పగా ప్రారంభించావు శ్రేయస్ అయ్యర్. టీమ్‌ఇండియా టెస్టు క్రికెట్లో నువ్వు భాగమైనందుకు సంతోషంగా ఉంది’ - సచిన్ తెందూల్కర్
‘శ్రేయస్.. చాలా బాగా ఆడావు. అరంగేట్ర టెస్టులోనే శతకంతో ఆకట్టుకున్నావు’ - విరాట్ కోహ్లి
‘టెస్టు కెరీర్‌ను చాలా ఘనంగా ప్రారంభించావు శ్రేయస్’ - రోహిత్ శర్మ
‘తీవ్ర ఒత్తిడిలో కూడా చాలా బాగా ఆడావు శ్రేయస్. నిలకడగా ఆడుతూ గొప్ప పరిణతి చూపించావు. అరంగేట్ర టెస్టులోనే శతకం చేసిన 16వ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కావు. ఇలాంటి శతకాలు ఇంకెన్నో సాధించాలి’ - వీవీఎస్ లక్ష్మణ్
‘క్లిష్ట పరిస్థితుల్లోనూ శతకంతో ఆకట్టుకున్నావు శ్రేయస్’ - ఇర్ఫాన్ పఠాన్
మరో వైపు, రెండో రోజు 258/4 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్‌ని ఆరంభించిన టీమ్‌ఇండియా 345 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ రెండో రోజు ఆట ముగిసే సరికి 129/0 స్కోరుతో నిలిచింది.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.