Kohli 100th Test : విరాట్.. వందలో వంద కొట్టి వారి సరసన నిలవాలి: గావస్కర్‌

టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ వందో టెస్టు మ్యాచ్‌ కోసం..

Updated : 02 Mar 2022 13:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ వందో టెస్టు మ్యాచ్‌ కోసం క్రికెట్ అభిమానులు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శుక్రవారం నుంచి శ్రీలంకతో జరగబోయే మ్యాచ్‌పైనే అందరి దృష్టి నెలకొంది.  ఈ వందో టెస్టు మ్యాచ్‌లో.. విరాట్‌ కోహ్లీ ప్రత్యేక బ్యాటింగ్‌ ప్రదర్శన ఉంటుందని భారత క్రికెట్‌ దిగ్గజం సునిల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా 38 పరుగులు చేసి ఎనిమిది వేల పరుగులు చేసిన బ్యాటర్‌గానూ అవతరిస్తాడని చెప్పాడు. ‘‘వందో టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ శతకం చేస్తాడని ఆశిస్తున్నా. ఇప్పటి వరకు చాలామంది క్రికెటర్లు ఆ ఫీట్‌ను అందుకోలేదు. నాకు తెలిసి కొలిన్‌ కౌడ్రే, జావెద్ మియాందాద్‌, అలెక్స్‌ స్టీవర్ట్‌, ఇంజమామ్‌, రూట్ శతకాలను బాదారు’’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు.

రెండేళ్ల నుంచి సెంచరీ కొట్టలేదనే వాదనపైనా సునిల్ గావస్కర్ స్పందిస్తూ.. ‘‘లక్ష్యం అందుకోవాలనే తపన ఉండాలి. చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటాం. సక్సెస్‌ వచ్చినప్పుడు దానిని నిలబెట్టుకోవడం కోసం ప్రతి సంవత్సరం కష్టపడతాం. ఇప్పుడు విరాట్ కోహ్లీకి వందో టెస్టు కూడా అలాంటిదే’’ అని గావస్కర్‌ వివరించాడు. మొహాలీ టెస్టు మ్యాచ్‌కు 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకులకు అనుమతి లేకుండానే నిర్వహించేందుకు తొలుత నిర్ణయించినా.. అభిమానుల నుంచి విమర్శలు రావడంతో మార్పులు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని