IPL 2022: సునీల్ నరైన్‌.. ‘ది కమ్‌ బ్యాక్ కింగ్’ షార్ట్ ఫిలిమ్‌ చూశారా!

క్రికెట్లో తనకు ఏదీ సులభంగా దక్కలేదని.. ఒక్కో మెట్టు ఎక్కడం వెనుక ఎంతో శ్రమ దాగి ఉందన్నాడు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఆటగాడు సునీల్ నరైన్‌. తన క్రికెట్ కెరీర్ అంతా కోల్‌కతాలోనే సాగిందని, అందుకే ఆ మహానగరాన్ని తన రెండో......

Published : 03 Dec 2021 01:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్లో తనకు ఏదీ సులభంగా దక్కలేదని.. ఒక్కో మెట్టు ఎక్కడం వెనుక ఎంతో శ్రమ దాగి ఉందన్నాడు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఆటగాడు సునీల్ నరైన్‌. తన క్రికెట్ కెరీర్ అంతా కోల్‌కతాలోనే సాగిందని, అందుకే ఆ మహానగరాన్ని తన రెండో ఇల్లుగా భావిస్తానని చెప్పుకొచ్చాడు. దాదాపు దశాబ్ద కాలంగా కేకేఆర్‌ జట్టు తరఫున ఆడుతున్న నరైన్‌.. 2012, 2014 సీజన్లలో కోల్‌కతా ఛాంపియన్‌గా నిలవడంలో కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఐపీఎల్-2022 సీజన్‌కి కోల్‌కతా యాజమాన్యం రూ.6 కోట్లకు సునీల్ నరైన్‌ని రిటెయిన్‌ చేసుకుంది. సునీల్ నరైన్‌ కెరీర్‌ సాగిన తీరును వివరిస్తూ కేకేఆర్ యాజమాన్యం.. ‘సునీల్ నరైన్.. ది కమ్‌ బ్యాక్‌ కింగ్‌’ అనే షార్ట్ ఫిలిమ్‌ రూపొందించింది. ఇటీవల దాన్ని కేకేఆర్ అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌లో పంచుకుంది. 

‘2014 ఛాంపియన్స్‌ లీగ్ టీ20ల్లో ఆడుతున్న సమయంలో అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా నిషేధం విధించినప్పుడు నా కెరీర్‌ ముగిసిపోయిందనుకున్నాను. ఐపీఎల్-2020 సీజన్‌లో కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. నా కెరీర్ పూలపాన్పు కాదు. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నా. అది చాలా గడ్డుకాలం. క్రికెట్లో నాకు ఏదీ సులభంగా దక్కలేదు. ఒక్కో మెట్టు ఎక్కడానికి ఎంతో కష్టపడ్డాను’ అని సునీల్ నరైన్ పేర్కొన్నాడు. తన కెరీర్ గురించి నరైన్‌ చెప్పిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ షార్ట్ ఫిలిం చూడాల్సిందే..!

Read latest Sports News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని