పీపీఈ కిట్లు ధరించి విమానమెక్కిన క్రికెటర్లు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020 సందడి మొదలైంది. ఆటగాళ్లు పొట్టి క్రికెట్‌ వేడుకకు సిద్ధమయ్యారు. ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన శిబిరాల్లో చేరిపోయారు. ప్రస్తుతానికి ఏ జట్టుకాజట్టు బయో బుడగలో ఉంటున్నాయి. త్వరలోనే వీరంతా దుబాయ్‌ చేరుకుంటారు. కరోనా వైరస్‌ ముప్పు నేపథ్యంలో...

Published : 17 Aug 2020 21:17 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020 సందడి మొదలైంది. ఆటగాళ్లు పొట్టి క్రికెట్‌ వేడుకకు సిద్ధమయ్యారు. ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన శిబిరాల్లో చేరిపోయారు. ప్రస్తుతానికి ఏ జట్టుకాజట్టు బయో బుడగలో ఉంటున్నాయి. త్వరలోనే వీరంతా దుబాయ్‌ చేరుకుంటారు. కరోనా వైరస్‌ ముప్పు నేపథ్యంలో యాజమాన్యాలు కట్టుదిట్టమైన జాగ్రత్తలు పాటిస్తున్నాయి.

తాజాగా రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లు పీపీఈ కిట్లు ధరించి మాస్క్‌లు వేసుకొని కనిపించారు. ముంబయి, బెంగళూరు నుంచి ఆ జట్ల ఆటగాళ్లు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించారు. వెళ్లింది దుబాయ్‌కేనా లేక భారత్‌లోనే అందరూ కలిసి ఒక చోటకు చేరుకున్నారా తెలియడం లేదు. సోషల్‌ మీడియాలో ఇందుకు సంబంధించిన చిత్రాలు వైరల్‌గా మారాయి.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఆటగాళ్లు సైతం శిక్షణ మొదలుపెట్టారు. కోచ్‌ అనిల్‌ కుంబ్లే నేతృత్వంలో సాధన చేస్తున్నారు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ సహచరులు మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌, గౌతమ్‌ యాదవ్‌, సుచిత్‌ మైదానంలో కష్టపడ్డారు. వీరిలో ఎక్కువమంది కర్ణాటక ఆటగాళ్లే కావడం గమనార్హం. మిగతా జట్లు, ఆటగాళ్లు సైతం ఉత్సాహంగా ఉన్నారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని