Ronaldo: రొనాల్డో ఇన్‌స్టా ఫాలోవర్లు @ 40 కోట్లు.. మరి భారత్‌లో ఎవరికి ఎక్కువంటే?

 పోర్చగల్‌కు చెందిన ఫుట్‌బాల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో తన ఆటతోనే...

Published : 08 Feb 2022 17:32 IST

అరుదైన రికార్డును సృష్టించిన పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు

ఇంటర్నెట్ డెస్క్‌: పోర్చగల్‌కు చెందిన ఫుట్‌బాల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో తన ఆటతోనే కాకుండా ఇప్పుడు మరో అరుదైన ఘనతతో అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు. ప్రస్తుతం ఉన్న సామాజిక మాధ్యమాల్లో ప్రముఖమైన వాటిల్లో ఇన్‌స్టాగ్రామ్‌ ఒకటి. మరి అలాంటి ఇన్‌స్టాగ్రామ్‌లో క్రిస్టియానా రొనాల్డో అద్భుతమైన ఫీట్‌ను సాధించాడు.  ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్లకు (40 కోట్లు) పైగా ఫాలోవర్లను  సంపాదించిన ఏకైక తొలి వ్యక్తిగా రొనాల్డో రికార్డును సృష్టించాడు. ప్రస్తుతం మొత్తం రొనాల్డోను ఇన్‌స్టాలో 40, 00,47,023 మంది అనుసరిస్తున్నారు. రొనాల్డో కంటే సోషల్‌ మీడియా అధికారిక సంస్థ ‘ఇన్‌స్టాగ్రామ్‌’కు మాత్రమే అధిక సంఖ్యలో (46,91,25,376 మంది) ఫాలోవర్లు ఉన్నారు. గతేడాది జనవరి నాటికి కేవలం 20 కోట్లు మాత్రమే ఉన్న ఫాలోవర్ల సంఖ్య సంవత్సరం తిరిగేసరికి రెట్టింపు కావడం విశేషం. గత శనివారం రొనాల్డో 37 ఏడాదిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అభిమానుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో తన జీవిత భాగస్వామి జార్జినా రోడ్రిగ్జ్‌తో కలిసి ఫొటో షేర్‌ చేశాడు. 

ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డో తర్వాత మోడల్‌ కైలీ జెన్నెర్ (30.86 కోట్లు), ఫుట్‌బాల్‌ ఆటగాడు మెస్సీ (30.62 కోట్లు), యాక్టర్‌ డ్వేనె జాన్‌సన్ (29.57 కోట్లు) తర్వాతి వరుసల్లో ఉన్నారు. టీమ్ఇండియా క్రికెటర్‌ విరాట్ కోహ్లీ 18.25 కోట్ల మంది ఫాలోవర్లతో ప్రపంచవ్యాప్తంగా 17వ స్థానంలో ఉన్నాడు. అయితే భారత్‌ నుంచి టాప్‌ స్థానం కోహ్లీదే. ఇదే వరుసలో కోహ్లీ తర్వాత ప్రియాంక చోప్రాను (వరల్డ్‌లో 38వ స్థానం) 7.39 కోట్ల మంది అభిమానులు అనుసరిస్తున్నారు. శ్రద్ధా కపూర్‌ను (47వ స్థానం) 6.87 కోట్ల మంది, నేహా కక్కర్ (49వ స్థానం) 6.76 కోట్ల మంది, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని (52వ స్థానం) 6.53 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని