MS Dhoni- Ronaldo: క్రిస్టియానో రొనాల్డోకు ధోనీతో పోలిక.. ఫ్యాన్స్‌ రియాక్షన్ ఇదే

స్టార్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డోను భారత మాజీ కెప్టెన్‌ ధోనీతో పోల్చుతూ ఫిఫా వరల్డ్ కప్‌ ఓ ఆసక్తికరమైన పోస్టు చేసింది.

Updated : 19 Jun 2024 12:45 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌( footballer) క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) పేరు ముందుంటుంది.  ఈ స్టార్‌ ఫుట్‌బాలర్‌ యూరో కప్‌లో ఆడటానికి సిద్ధమవుతున్నాడు. ఈ తరుణంలో ఫిఫా ప్రపంచకప్‌ ఒక ఆసక్తికర పోస్టు చేసి భారత క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ (MS Dhoni)తో క్రిస్టియానో రొనాల్డోను పోల్చుతూ ఫిఫా వరల్డ్ కప్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆసక్తికరమైన పోస్టు చేసింది. రొనాల్డో ఫొటోను పోస్టు చేస్తూ ‘తలా ఫర్‌ ఎ రీజన్‌ 7’ అనే వ్యాఖ్యను జత చేసింది. దీంతో ఆ పోస్టుకు భారత అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. చాలామంది నెటిజన్లు లైక్‌లు కొడుతూ తమ మద్దతు తెలుపుతున్నారు. 

సీఎస్కే అభిమానులతోపాటు ఇండియన్‌ ఫ్యాన్స్‌ కొంతకాలం నుంచి ధోనీని ‘తలా ఫర్‌ ఏ రీజన్‌’ అని పిలుచుకుంటున్నారు. తమిళంలో దీని అర్థం ‘లీడర్‌ ఫర్‌ ఏ రీజన్’. భారత క్రికెట్‌, సీఎస్కే తరఫున ధోనీ సాధించిన ఎన్నో గొప్ప విజయాలను గుర్తుచేసుకుంటూ ఫ్యాన్స్‌ ఈ నినాదాన్ని బయటకు తీసుకొచ్చారు. ఈ నినాదానికి ఉన్న క్రేజ్‌ను గుర్తించిన ఫిఫా రొనాల్డో ఫొటోతో ఆ వ్యాఖ్యను సోషల్ మీడియాలో పోస్టు చేసి భారత అభిమానుల మనసులను దోచుకుంది. ప్రస్తుతం భారత్‌లో ఫుట్‌బాల్‌కు పరిమిత సంఖ్యలోనే అభిమానులున్నారు. ఇలాంటి పోస్టుల ద్వారా ఇండియన్‌ ఫ్యాన్స్‌ని ఫుట్‌బాల్‌ వైపు ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది ఫిఫా. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. ధోనీలానే రొనాల్డో కూడా 7 నంబర్‌ జెర్సీని వాడతాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని