IPL 2023: ఈసారి మా గేమ్ ప్లాన్ మాత్రం అలా ఉండదు: చెన్నై సూపర్ కింగ్స్ కోచ్
అతి పెద్ద నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ (GT vs CSK) మధ్య నేడు ఫైనల్ పోరు జరగనుంది. కప్ విజేతను తేల్చే మ్యాచ్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) సీజన్ విజేతను తేల్చే పోరు కోసం చెన్నైసూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ (GT vs CSK) సిద్ధమవుతున్నాయి. సీఎస్‌కే జట్టులో ధోనీ (MS Dhoni) ప్రధాన ఆకర్షణ కాగా.. గుజరాత్‌లో మాత్రం సెంచరీల హీరో శుభ్‌మన్ గిల్‌దే (Shubman Gill) హవా. ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. అతడిని అడ్డుకోవడంపైనే సీఎస్‌కే (CSK) విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో సీఎస్‌కే ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తమ జట్టు సన్నద్ధతపై కీలక వ్యాఖ్యలు చేశాడు. గతంలో కంటే ఇప్పుడు తమ ప్రిపరేషన్ మరింత ఉత్తమంగా ఉందని పేర్కొన్నాడు. సాధారణంగా తమ గెలుపు - ఓటముల నిష్పత్తి 50 శాతంగా ఉందని తెలిపాడు.
‘‘ఫైనల్ మ్యాచ్‌లు ఎప్పుడూ సవాళ్లతో కూడకున్నవే. మేం బయటి మైదానాల్లో కొన్నిసార్లు పరిస్థితులతో పోరాడాల్సి వచ్చింది. అయితే, ఈసారి చెన్నై బాగా సన్నద్ధమైంది. తుదిపోరులో విజయం సాధించడంలో మా రికార్డు 50 శాతంగా ఉంది. మా గేమ్ శైలి ప్రకారం.. సొంత మైదానాల్లో అద్భుతంగా ఆడాం. తటస్థ వేదికల్లో త్వరగా కుదురుకోవాల్సిన అవసరం ఉంది. తొలి క్వాలిఫయర్‌లో తొలుత మేం బౌలింగ్ చేయాలని భావించాం. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేయడం సరైందేనని తేలింది. ఎంఎస్ ధోనీ కూడా తన కెప్టెన్సీతో సీఎస్‌కేను గెలిపించాడు. ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే.. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలి. అహ్మదాబాద్ పిచ్ పరిస్థితుల గురించి మాకేం ఆందోళన లేదు. గతంలో కంటే ఇప్పుడు మరింత బలోపేతంగా ఉన్నాం.
శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతడిని అడ్డుకోవడానికి సంబంధించి మా ప్రణాళికల్లో ఎలాంటి మార్పులు ఉండవు. గిల్‌ను త్వరగా ఔట్ చేయాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్‌లో (గుజరాత్‌తో) త్వరగా వికెట్లను తీయడం వల్ల పైచేయి సాధించగలిగాం. వరుసగా టైటిళ్లను సాధించడం చాలా కష్టం. గుజరాత్‌కు కష్టమవుతుందని భావిస్తున్నా. అయితే, అన్ని విభాగాల్లోనూ బలమైన టీమ్. తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఆశిశ్ నెహ్రా ఆధ్వర్యంలోని కోచింగ్ టీమ్ అద్భుతంగా పని చేస్తోంది. సీఎస్‌కే తరఫున ఆడినప్పుడు కూడా ఇదే ఉత్సాహంతో ఉండేవాడు. అయితే, మాకున్న అనుభవం వల్ల తప్పకుండా ఫైనల్‌లో గెలిచి కప్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తాం’’ అని ఫ్లెమింగ్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Defamation: కాంగ్రెస్ ఎంపీపై.. అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా!
-
Revanth Reddy: కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయి: రేవంత్‌రెడ్డి
-
Suryakumar Yadav: ఇన్నాళ్లూ తికమక పడ్డా.. నా కొత్త పాత్రను ఇష్టపడుతున్నా: సూర్యకుమార్
-
2 Year Old Girl: రాత్రి సమయంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి.. చివరకు..!
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
Congress-CPI: కాంగ్రెస్-సీపీఐ పొత్తు.. చర్చలు కొనసాగుతున్నాయ్: చాడ వెంకట్‌రెడ్డి