MS Dhoni: ‘ధోనీ అంటే కేవలం లీడర్ మాత్రమే కాదు.. ఓ ఎమోషన్’
నేడు ఐపీఎల్ ఫైనల్(IPL Final) నేపథ్యంలో చెన్నై సారథి ధోనీ(MS Dhoni)పై తమ అభిమానాన్ని చాటుతూ పలువురు ప్రత్యేక సందేశాలు పెడుతున్నారు.
ఇంటర్నెట్‌డెస్క్ : ఐపీఎల్ ఫైనల్(IPL 2023 Final) నేడే. ఐదోసారి టైటిల్‌పై కన్నేసిన చెన్నై(chennai super kings).. గుజరాత్(Gujarat Titans)తో తలపడనుంది. ఈసారి విజేతగా నిలిచి.. ముంబయి రికార్డును సమం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు సీఎస్కే సారథి ధోనీ(MS Dhoni)కిదే చివరి సీజన్ అంటూ ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో.. అభిమానులు తమదైన శైలిలో ప్రత్యేక సందేశాలు పెడుతున్నారు.
కేవలం ధోనీ కోసమే మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చిన అభిమానులు ఎంతో మంది ఉన్నారు. మహీ మైదానంలో కనిపిస్తే చాలు.. వారి ఉత్సాహం రెట్టింపవుతుంది. ధోనీ కూడా ఈ సీజన్‌లో అభిమానుల పట్ల తన కృతజ్ఞతను పలుసార్లు ప్రకటించాడు. చెన్నై చెపాక్ మైదానంలో చివరి లీగ్ మ్యాచ్‌ను ఆడిన అనంతరం ధోనీ.. స్టేడియంలో పరేడ్ నిర్వహించి అభిమానుల వైపు జెర్సీలను విసిరిన విషయం తెలిసిందే. నేడు ఫైనల్ నేపథ్యంలో అభిమానులు ధోనీపై చూపించే ప్రేమకు సంబంధించి ఓ వీడియోను ఐపీఎల్(IPL) ట్విటర్‌లో పంచుకుంది. ‘ధోనీ అంటే కేవలం లీడర్ మాత్రమే కాదు.. ఓ ఎమోషన్’, ‘ప్రతి ఒక్కరూ ధోనీ అభిమానే’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో పలువురు ధోనీపై అభిమానం వ్యక్తం చేశారిలా..
- ‘ఐపీఎల్ విధుల్లో నేను 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ధోనీని చూడటం కోసమే నేను ఈ జాబ్ చేస్తున్నాను’
- ‘ధోనికిదే చివరి ఐపీఎల్ అని పలువురు అంటున్నారు. అది నిజమో కాదో తెలియదు. అయితే.. భవిష్యత్తులో సీఎస్కేకు ఎంత మంది కెప్టెన్లు వచ్చినా.. ధోనీలాంటి వారిని మాత్రం మనం ఎప్పుడూ చూడం’
- ‘ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. చాలా కూల్‌గా ఉంటాడు. తలా ఎప్పటికీ తలానే’
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
iPhone: ఐఫోన్ డెలివరీ ఆలస్యం.. కోపంతో షాపు ఉద్యోగులనే చితకబాదారు
-
Defamation: కాంగ్రెస్ ఎంపీపై.. అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా!
-
Revanth Reddy: కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయి: రేవంత్‌రెడ్డి
-
Suryakumar Yadav: ఇన్నాళ్లూ తికమక పడ్డా.. నా కొత్త పాత్రను ఇష్టపడుతున్నా: సూర్యకుమార్
-
2 Year Old Girl: రాత్రి సమయంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి.. చివరకు..!