CSK vs RR: ధోనీ - జడ్డూ బ్యాటింగ్‌.. రికార్డులను కొల్లగొట్టిన చివరి ఓవర్‌

చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK vs RR) ఓడిపోయినప్పటికీ.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ధోనీ - జడేజా చివరి వరకు పోరాడిన తీరు అభిమానులను ఆకట్టుకుంది.

Published : 13 Apr 2023 21:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ చరిత్రలో (IPL) చెన్నై సూపర్ కింగ్స్ X రాజస్థాన్‌ రాయల్స్ (CSK vs RR) జట్ల మధ్య చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌ రికార్డులను కొల్లగొట్టింది. వ్యూవర్‌షిప్‌లో గత మ్యాచ్‌లను అధిగమించడం విశేషం. జియో సినిమాలో ఈ ఏడాది ఐపీఎల్‌ను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో సీఎస్‌కే వర్సెస్ ఆర్‌ఆర్‌ మ్యాచ్‌ చివరి ఓవర్‌ను దాదాపు 2.2 కోట్ల మందికిపైగా వీక్షించినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 20 పరుగులు అవసరం కాగా.. సందీప్ శర్మ బౌలింగ్‌లో కెప్టెన్ ధోనీ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టాడు. అయితే, చివరి మూడు బంతులకు ఏడు పరుగులే  అవసరం కాగా.. మూడు సింగిల్స్‌ మాత్రమే రావడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. 

 ఇదే సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB), లఖ్‌నవూ సూపర్‌ జెయింట్‌ (LSG) మ్యాచ్‌ను ఓ సందర్భంలో 1.8 కోట్ల మంది వీక్షించారు. అలాగే ముంబయి - దిల్లీ మ్యాచ్‌ను 1.7 కోట్లు, సీఎస్‌కే - ఎల్‌ఎస్‌జీ మ్యాచ్‌ను 1.7 కోట్లు వీక్షించారు. ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌ సీఎస్‌కే - గుజరాత్‌ పోరును 1.6 కోట్ల మంది వీక్షించినట్లు తెలుస్తోంది. పంజాబ్‌, గుజరాత్‌ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్‌ జరగనుంది. మరి ఈ మ్యాచ్‌లో ఏమైనా రికార్డులు బద్దలు అవుతాయేమో చూడాలి..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని