IPL 2021: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌..

పీఎల్‌ మలిదశలో భాగంగా.. షార్జా వేదికగా మరి కొద్దిసేపట్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌), చెన్నై సూపర్‌ కింగ్స్ (సీఎస్‌కే) జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కేవలం..

Updated : 30 Sep 2021 19:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ మలిదశలో భాగంగా.. షార్జా వేదికగా మరి కొద్దిసేపట్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌), చెన్నై సూపర్‌ కింగ్స్ (సీఎస్‌కే) జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కేవలం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతున్న హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కి దూరమైంది. ఎనిమిది విజయాలతో అగ్రస్థానంలో ఉన్న చెన్నై జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్‌ ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే. 

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు..

జేసన్‌ రాయ్‌, వృద్ధిమాన్ సాహా (వికెట్‌ కీపర్‌), కేన్‌ విలియమ్సన్ (కెప్టెన్‌), ప్రియమ్‌ గార్గ్, అభిషేక్‌ శర్మ, అబ్దుల్‌ సమద్‌, జేసన్‌ హోల్డర్, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్, సిద్దార్థ్‌ కౌల్‌, సందీప్‌ శర్మ

చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు..

రుతురాజ్‌ గైక్వాడ్‌, డు ప్లెసిస్, మొయిన్‌ అలీ, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), డ్వేన్‌ బ్రావో, శార్ధూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్, జోష్‌ హేజిల్‌వుడ్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని