Pat Cummins: అలాంటి ఆరోపణలను కొట్టిపారేసిన ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్ కమిన్స్

మరో వారం రోజుల్లో భారత్‌ పర్యటనకు ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు రానుంది. నాలుగు టెస్టులు, మూడు వన్డేలను ఆడనుంది. ఈ క్రమంలో ఆ జట్టు టెస్టు, వన్డే జట్టు సారథి ప్యాట్‌ కమిన్స్‌పై పాత వివాదం మళ్లీ రాజుకొంది. 

Published : 26 Jan 2023 01:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మరో వారం రోజుల్లో భారత్‌ పర్యటనకు ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు రానుంది. నాలుగు టెస్టులు, మూడు వన్డేలను ఆడనుంది. ఈ క్రమంలో ఆ జట్టు టెస్టు, వన్డే జట్టు సారథి ప్యాట్‌ కమిన్స్‌పై పాత వివాదం మళ్లీ రాజుకొంది. స్పాన్సర్‌కు సంబంధించిన ప్రకటనల్లో కనిపించేందుకు ప్యాట్‌ కమిన్స్‌ తిరస్కరించడం వల్ల క్రికెట్‌ ఆస్ట్రేలియా (CA) బోర్డు నష్టపోవాల్సి వచ్చిందని, దానికి కారణం అతడేనని ఆరోపణలు వచ్చాయి. దాదాపు 40 మిలియన్‌ ఆస్ట్రేలియా డాలర్లను కోల్పోవాల్సి వచ్చిందని  సీఏ పేర్కొంది. ఇప్పుడు మరోసారి అలాంటి ఆరోపణలు చుట్టుముట్టడం ఆసీస్‌ క్రికెట్ అభిమానులను ఆందోళన కలిగిస్తోంది.

అయితే ఆ ఆరోపణలను మాత్రం కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్ కొట్టిపడేశాడు. ‘‘ఇప్పుడు నేనున్న స్థాయిని బట్టి వివిధ విషయాల్లోకి లాగేందుకు చూస్తుంటారు. మీ గురించి తెలియని వ్యక్తులు నానారకాలుగా అనుకుంటూ ఉంటారు. పక్కవారి విషయాలపైనే కాస్త ఎక్కువగా ఆసక్తితో ఉంటారు. అయితే కొందరు తమ విలువలను వదిలేయలేరు. నిర్ణయాలు తీసుకొనేటప్పుడు సమతూకంగా ఉండాల్సిన అవసరం ఉంది’’ అని కమిన్స్‌ వ్యాఖ్యానించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని