CWG 2022: రవి దహియా, వినేష్‌ పొగట్‌, నవీన్‌ పసిడి పట్టు.. రెజ్లింగ్‌లో స్వర్ణాల పంట

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత రెగ్జర్లు ఉడుంపట్టు పడుతున్నారు. తాజాగా రవి దహియా స్వర్ణం సాధించాడు.........

Updated : 15 Aug 2022 14:43 IST

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత రెజ్లర్లు ఉడుంపట్టు పట్టారు. తాజాగా రవి దహియా, వినేష్‌ పొగట్‌, నవీన్‌ స్వర్ణాలు సాధించారు. 57కిలోల విభాగంలో ఫైనల్‌ పోటీలో రవి దహియా.. నైజీరియాకు చెందిన ఎబికేవినెమోను మట్టికరిపించి పసిడి సాధించాడు. 53 కేజీల విభాగంలో వినేష్‌ పొగట్‌ .. శ్రీలంకకు చెందిన చమోద్య కేశనీపై విజయం సాధించింది. ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌ 74 కిలోల విభాగంలో నవీన్‌ బంగారు పతకం సాధించాడు. పాకిస్థాన్‌ రెజ్లర్‌ మహ్మద్‌ షరీఫ్‌ తాహిర్‌పై 9-0 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. రెజ్లింగ్‌లో భారత్‌కు ఇది ఆరో స్వర్ణం. శనివారం బజ్‌రంగ్‌ పునియా, దీపక్‌ పునియా, సాక్షి మలిక్‌ పసిడి కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.  దీంతో కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ స్వర్ణాల సంఖ్య 12కి చేరింది. 

పూజా గెహ్లోత్‌కు కాంస్యం

రెజ్లింగ్‌ మహిళల 50కేజీల విభాగంలో పూజా గెహ్లోత్‌ సాంస్యం సాధించింది. కామన్వెల్త్‌ క్రీడల్లో 50కిలోల ఫ్రీస్టైల్‌ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఆమె 12-2తో స్కాట్లాండ్‌కు చెందిన క్రిస్టెల్టే లామోఫాక్ లెచిడ్జియోను చిత్తుచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని