Updated : 05 Aug 2022 21:41 IST

CWG 2022: క్వార్టర్స్‌కు సింధు, శ్రీకాంత్.. ఫైనల్‌కు భజ్‌రంగ్‌, దీపక్‌, అన్షు, సాక్షి

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత షట్లర్లు పీసీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరారు. ఇద్దరూ తమ సింగిల్స్‌ పోటీల్లో శుక్రవారం ప్రిక్వార్టర్స్‌లో తలపడి ప్రత్యర్థులపై తేలిగ్గా విజయం సాధించారు. దీంతో తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌ పోటీల్లో సింధు.. ఉగాండాకు చెందిన షట్లర్‌ హుసినా కొబుగాబెపై 21-10, 21-9 తేడాతో గెలవగా.. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌.. శ్రీలంక ఆటగాడు దుమిండు అబెవిక్రమపై 21-9, 21-12 తేడాతో సునాయాస విజయం సాధించాడు. ఇక సింధు తన తర్వాతి పోరులో మలేషియా షట్లర్‌ గోహ్‌ జిన్‌ వీతో తలపడనుండగా.. శ్రీకాంత్‌ ఇంగ్లాండ్‌ ఆటగాడు టోబీ పెంటీతో పోటీపడనున్నాడు.

* మరోవైపు రెజ్లింగ్‌లో భారత టాప్‌ రెజ్లర్లు దూసుకుపోతున్నారు. భజరంగ్‌ పునియా (65కేజీలు), దీపక్‌ పునియా (86 కేజీలు), అన్షు మాలిక్‌ (57 కేజీలు), సాక్షి మాలిక్‌ (62 కేజీలు) వివిధ కేటగిరీల్లో సెమీస్‌లో ప్రత్యర్థులను ఓడించి ఫైనల్స్‌కు చేరారు. ఈ నలుగురు తమ తుదిపోర్లలో గెలిస్తే భారత్‌కు మరో నాలుగు స్వర్ణ పతకాలు దక్కినట్టే.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts