Published : 05 Aug 2022 17:15 IST

CWG 2022: కామన్వెల్త్‌ క్రీడల్లో రెజ్లింగ్‌ పోటీలు నిలిపివేత

(Photo: Birmingham 2022 Twitter)

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకోవడంతో రెజ్లింగ్‌ పోటీలను నిలిపివేశారు. శుక్రవారం రెజ్లింగ్‌ పోటీలు ప్రారంభమైన కొద్దిసేపటికే అక్కడ ఒక స్పీకర్‌ సీలింగ్‌ పైనుంచి కిందపడిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన నిర్వాహకులు ఈ పోటీలను నిలిపివేసి.. అక్కడున్న వారందరినీ బయటకు పంపించేశారు. భారత రెజ్లర్‌ దీపక్‌ పునియా 86 కేజీల విభాగంలో తలపడి.. విజేతగా నిలిచి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించిన కొద్ది క్షణాలకే ఆ స్పీకర్‌ కిందపడ్డాడు. దీంతో భద్రతా ప్రమాణాల రీత్యా మరో దుర్ఘటన చోటుచేసుకోవద్దనే ఉద్దేశంతో స్టేడియాన్ని పూర్తిగా పునఃపరిశీలించడానికి నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడున్న వారిని బయటకు పంపారు. పూర్తి తనిఖీలు పూర్తయ్యాక ఈ పోటీలను తిరిగి కొనసాగిస్తామని వారు చెప్పారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts