CWG 2022: భారత్‌ ఖాతాలో మరో రెండు పతకాలు

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. ఎనిమిదో రోజు ముగిసేసారికి  9 స్వర్ణాలు, 8 రజతాలు, 9 కాంస్యలతో మొత్తం 26 పతకాలు సాధించి ఐదో ప్లేస్‌లో భారత్‌

Updated : 06 Aug 2022 17:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. ఎనిమిదో రోజు ముగిసేసరికి 9 స్వర్ణాలు, 8 రజతాలు, 9 కాంస్యలతో మొత్తం 26 పతకాలు సాధించి ఐదో ప్లేస్‌లో భారత్‌ ఉంది. తాజాగా మహిళల 10 వేల మీటర్ల రేస్ వాక్‌లో భారత క్రీడాకారిణి ప్రియాంక గోస్వామి అద్భుత ప్రదర్శన చేసి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రియాంక 43:38.82లో రేసును పూర్తి చేసింది. పురుషుల 300మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్‌లో అవినాష్ సాబ్లే రజతం సాధించాడు. 8:11.20లో రేసు పూర్తిచేసి భారత్‌ తరఫున అత్యుత్తమ ప్రదర్శన నమోదుచేశాడు. దీంతో భారత్‌ పతకాల సంఖ్య 28కు చేరింది. మరోవైపు భారత బాక్సర్లు అమిత్ పంఘల్ (పురుషుల ఫ్లై వెయిట్), నీతూ ఘంగాస్ (మహిళల విభాగం) ఫైనల్‌ చేరారు. రెజ్లింగ్‌లో మహిళల 76 కేజీల క్వార్టర్‌ ఫైనల్‌లో పూజా సిహాగ్‌ న్యూజిలాండ్‌ ప్లేయర్ మిచెల్‌ మాంటేగ్‌ను ఓడించి సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. పురుషుల 74 కేజీల క్వార్టర్ ఫైనల్లో నవీన్ సింగపూర్‌కు చెందిన హాంగ్ యోవ్ లూను ఓడించి సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని