Danish kaneria: భారత టీ20 లీగ్‌ గురించి ఆలోచించడం మానేయండి: డానిష్‌ కనేరియా

భారత ఆటగాళ్లు టీ20 లీగ్‌పై ఉన్న ఆసక్తిని అంతర్జాతీయ క్రికెట్‌పై కూడా చూపాలంటూ పాక్‌ మాజీ ఆటగాడు విమర్శించాడు. 

Published : 09 Dec 2022 17:54 IST

దిల్లీ: బంగ్లాదేశ్‌(Bangladesh)తో సిరీస్ నేపథ్యంలో భారత ఆటగాళ్లపై పాకిస్థాన్‌(Pakistan) మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా(Danish kaneria) విమర్శలు గుప్పించాడు. భారత టీ20 లీగ్‌(T20 league) గురించి ఆలోచించడం మాని అంతర్జాతీయ క్రికెట్‌పై వారు దృష్టి సారించాలని అన్నాడు. సిరీస్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమ్‌ఇండియా బంగ్లా ఆటగాళ్ల ధాటికి రాణించలేకపోయిన విషయం తెలిసిందే. దీంతో టెస్టు సిరీస్‌లోనైనా విజయాన్ని కైవసం చేసుకోవాలనే టీమ్ఇండియా పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో కనేరియా మాట్లాడుతూ ఆటగాళ్ల తీరును తప్పుపట్టాడు.

 ‘‘భారత టీ20 లీగ్‌ గురించి ఆలోచించడం మానేయండి. దేశం కోసం ఆలోచించండి. ఫ్రాంఛైజీ క్రికెట్‌ కన్నా భారత క్రికెట్‌ ఎంతో ముఖ్యం. ఫ్రాంఛైజీ క్రికెట్‌లో డబ్బు ఉంది. కానీ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి కూడా మీరది సంపాదించుకోవచ్చు. మీరు దేశం కోసం ఆడే ఆట ప్రాధాన్యాన్ని గుర్తించలేకపోతే ఇటువంటి ఫలితాలనే చూడాల్సి ఉంటుంది’’ అంటూ ఈ మాజీ ఆటగాడు వ్యాఖ్యలు చేశాడు. 

భారత జట్టుకు ఆటగాళ్ల మార్పుల విషయంలో నిర్దిష్టమైన ప్రణాళిక లేదన్నాడు. ఈ టెస్టు సిరీస్‌లో సైతం బంగ్లాదేనని పేర్కొన్నాడు. ‘‘ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలో బ్యాటర్లకే అవగాహన లేదు. ఎందుకంటే, వారితో ఒక్కోసారి ఒక్కో స్థానంలో ఆడిస్తుంటారు. బౌలింగ్‌ అటాక్‌లోనూ మార్పులు చేస్తుంటారు. ఈ విషయంలో సరైన ప్రణాళిక అమలు చేయడంలేదు. భారత క్రికెట్‌ పడిపోతోంది. బంగ్లాదేశ్‌ ఈ టెస్టు సిరీస్‌ను సైతం గెలిచే అవకాశం ఉంది’’ అంటూ తెలిపాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని