Team India: ఆ విషయంలో.. టీమ్‌ఇండియాను చూసి నేర్చుకోండి: పాక్‌కు కనేరియా సూచన
ప్రపంచకప్ టోర్నీకి జట్టును సిద్ధం చేసే విషయంలో భారత్‌ని చూసి పాకిస్థాన్ నేర్చుకోవాలని పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా (Danish Kaneria) సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మధ్య జరగనుండటంతో ఈ ఫార్మాట్‌లో టీమ్‌ఇండియా (Team India) వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడే విధంగా షెడ్యూల్‌ని రూపొందించింది బీసీసీఐ. అందుకు తగ్గట్టుగానే ఈ సంవత్సరంలో భారత జట్టు శుభారంభం చేసింది. శ్రీలంకపై వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్.. కివీస్‌పై వన్డే సిరీస్‌నూ తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆ దేశానికి కీలక సూచనలు చేశాడు. ప్రపంచ కప్ కోసం జట్టును సిద్ధం చేసే విషయంలో భారత్ నుంచి నేర్చుకోవాలని సూచించాడు. ఐసీసీ మెగా ఈవెంట్‌లో ఫేవరెటిజం జట్టు నిర్మాణంలో సహయపడదని పేర్కొన్నాడు. ఈ ఏడాదిని పాకిస్థాన్ ఓటమితో ప్రారంభించింది. న్యూజిలాండ్‌తో 1-2 తేడాతో వన్డే సిరీస్‌ని కోల్పోయింది.
దురదృష్టవశాత్తు రిషభ్ పంత్ (Rishabh Pant) కారు ప్రమాదంలో గాయపడి వన్డే ప్రపంచకప్ టోర్నీకి అందుబాటులో ఉండేది అనుమానంగా మారడంతో వికెట్‌కీపర్‌గా కేఎల్ రాహుల్‌కు బ్యాకప్‌గా ఇషాన్ కిషన్‌ని సిద్ధం చేస్తున్నారని కనేరియా చెప్పాడు. పాక్ జట్టులో ఇలా జరగడం లేదన్నాడు. మహ్మద్ రిజ్వాన్‌కు బ్యాకప్‌గా మహ్మద్ హారిస్‌కు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నాడు. ప్రపంచ కప్ కోసం జట్టును నిర్మించడంలో అభిమానం సహాయం చేయదని డానిష్ కనేరియా విమర్శించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
ECI: 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం
-
Politics News
Raghurama: బాబాయ్‌కి ప్రత్యేకహోదా సాధించిన జగన్: రఘురామ
-
Crime News
America: అమెరికాలో నిజామాబాద్ వాసి సజీవ దహనం
-
Ap-top-news News
Heat waves: సన్డే.. మండే.. ఏపీలో భగభగలే
-
Ap-top-news News
YSRCP: లాగిపడేయండి.. సస్పెండ్ చేస్తా: అధికార పార్టీ కార్పొరేటర్‌పై మేయర్ వ్యాఖ్యలు