SRH: తెలుగు మాటలతో పలకరించిన వార్నర్‌

ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు భారత్‌లోనూ విశేషమైన అభిమానులున్నారనే సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌ అయ్యాక తెలుగు అభిమానులు సైతం విపరీతంగా పెరిగిపోయారు...

Published : 29 May 2021 01:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు భారత్‌లోనూ విశేషమైన అభిమానులున్నారనే సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌ అయ్యాక తెలుగు అభిమానులు సైతం విపరీతంగా పెరిగిపోయారు. ఈ క్రమంలోనే గతేడాది టిక్‌టాక్‌ వీడియోలతో అతడు మనవారికి మరింత చేరువయ్యాడు. తాజాగా వార్నర్‌ తెలుగు మాటలతోనూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

గురువారం తన సతీమణి క్యాండిస్‌తో కలిసి ఒక అందమైన చిత్రాన్ని ఇన్‌స్టాలో పంచుకున్న అతడు ‘నేను నిన్ను ప్రేమిస్తున్నా’నంటూ తెలుగులోనే తన భార్యకు ప్రేమను వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్‌ అభిమానులను ఉద్దేశిస్తూ మరోసారి తన తెలుగు ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. సన్‌రైజర్స్‌ జెర్సీలో అతడు గర్జిస్తున్నట్లు.. పైన ఓ సింహం బొమ్మను కూడా చూపిస్తూ అభిమానులను అలరించాడు. దానికి ‘నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తాను అభిమానులారా. మీకు నా మీద ఉండే ప్రేమకి, ఇంకా మీ సహకారానికి ధన్యవాదాలు’ అంటూ పోస్టు చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు