IPL: వార్నర్ x స్లేటర్: మాల్దీవుల్లో గొడవ?
తాము మాల్దీవుల్లో గొడవ పడ్డామనే వార్తలు నిజం కాదని ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్, మైఖేల్ స్లేటర్ స్పష్టం చేశారు. ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడటంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు, ఇతర సిబ్బంది...
కొట్టిపారేసిన ఆస్ట్రేలియా క్రికెటర్లు..
ఇంటర్నెట్‌డెస్క్: తాము మాల్దీవుల్లో గొడవ పడ్డామనే వార్తలు నిజం కాదని ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్, మైఖేల్ స్లేటర్ స్పష్టం చేశారు. ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడటంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు, ఇతర సిబ్బంది, వ్యాఖ్యాతలు ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ ఓ బార్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాడు డేవిడ్ వార్నర్, వ్యాఖ్యాత మైఖేల్ స్లేటర్ మధ్య గొడవ జరిగిందని, ఇద్దరు కొట్టుకున్నారని ఓ అంతర్జాతీయ పత్రిక పేర్కొంది.
అయితే, ఈ విషయంపై వార్నర్, స్లేటర్ తాజాగా స్పందించారు. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేశారు. ఈ విషయంపై స్లేటర్ ఓ విలేకరికి పంపిన సందేశంలో.. ‘ఆ పుకార్లలో ఎంతమాత్రం నిజం లేదు. వార్నర్ నాకు మంచి స్నేహితుడు. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు’ అని వివరించాడు. ఇక వార్నర్ మాట్లాడుతూ ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయోనని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇక్కడ ఏం జరిగిందో చూడకుండా, సరైన ఆధారాలు లేకుండా ఇలాంటి తప్పుడు వార్తలు ఎలా రాస్తారని నిలదీశాడు.
కాగా, ఈనెల 15 వరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ నుంచి విమాన రాకపోకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దాంతో ఐపీఎల్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు టోర్నీ వాయిదా పడటంతో మాల్దీవుల్లో ఉంటున్నారు. అక్కడ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు మార్గం సుగుమం అయినప్పుడు అకడున్నవారంతా తమ ఇళ్లకు చేరుకుంటారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Aaron Finch: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆసీస్ టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ గుడ్‌బై!
-
Movies News
OTT Movies: బొమ్మ మీది.. స్ట్రీమింగ్ వేదిక మాది.. ఇప్పుడిదే ట్రెండ్!
-
World News
EarthQuake: భూకంపం ధాటికి.. రెండు ముక్కలైన ఎయిర్‌పోర్టు రన్‌వే
-
Politics News
Andhra News: బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని తగులబెట్టిన దుండగులు
-
Sports News
Ashwin - Australia: అశ్విన్‌ను చూస్తే ఆస్ట్రేలియాకు కంగారు ఎందుకు?.. సమాధానం ఇదిగో!
-
India News
Overseas Education: విదేశీ ఉన్నత విద్యపై భారీ క్రేజ్