David Warner: వీరాభిమానికి సారీ చెప్పిన డేవిడ్ భాయ్‌.. ఎందుకంటే..?

డేవిడ్‌ వార్నర్‌ మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో సుపరిచితుడు. తెలుగు సినిమాల్లోని...

Published : 24 Dec 2021 01:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డేవిడ్‌ వార్నర్‌ మన తెలుగు రాష్ట్రాల క్రికెట్‌ అభిమానులకు సుపరిచితుడే. తెలుగు సినిమాల్లోని డైలాగులకు తనదైన స్టైల్‌లో హావభావాలు పలికిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెడుతుంటాడు. ఇటీవల వచ్చిన ‘పుష్ప’ సినిమాలోని ‘తగ్గేదే.. లే’ డైలాగ్‌తో చేసిన వీడియోను పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడెందుకు వార్నర్‌ గురించి అంటారా..? గత సీజన్‌ వరకు ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున ఆడిన డేవిడ్ భాయ్‌కు ఆసీస్‌లోనే కాదు.. మన దగ్గరా వీరాభిమానులు ఉన్నారు. అలా ఓ అభిమాని పెట్టిన పోస్టుకు వార్నర్ ‘సారీ’ చెప్పడం విశేషం. అసలు అభిమానికి వార్నర్‌ ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చిందంటే?

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా కొన్ని రోజులుగా డేవిడ్ వార్నర్‌ బిజీబిజీగా ఉన్నాడు. దీంతో అభిమానుల ట్వీట్లకు రిప్లయ్‌ ఇవ్వలేకపోయాడు. అయితే డేవిడ్ వీరాభిమాని ఒకరు గత 27 రోజులుగా వరుసగా వార్నర్‌ స్పందన కోసం ట్వీట్ చేస్తూనే ఉన్నాడు. చివరికి ఇవాళ అభిమానికి ‘సారీ.. ఎలా ఉన్నావు’ అంటూ వార్నర్‌ రీట్వీట్‌ చేశాడు. సదరు అభిమాని గత నెల 27వ తేదీ నుంచి ట్వీట్‌ చేస్తూ ఉండటం గమనార్హం. డేవిడ్ వార్నర్‌ ట్వీట్ చేయడంతో ఇక అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అంతేకాదండోయ్‌ నెటిజన్ల నుంచి వార్నర్‌పై అభినందనలు వెల్లువెత్తాయి. ‘డేవిడ్ భాయ్‌ ఫ్యాన్స్‌ ఫేవరెట్’ అంటూ ఓ నెటిజన్‌ పోల్చాడు.

Read latest Sports News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని