David Warner: వార్నర్.. మీరు తెలుగు సినిమాల్లో నటించొచ్చుగా : నెట్‌ఫ్లిక్స్ సూచన
ఆస్ట్రేలియా టాప్ ఆటగాడు డేవిడ్ వార్నర్ (david warner) క్రికెట్ అభిమానులతోపాటు సినిమా ఫ్యాన్స్‌కూ సుపరిచితుడే. హిట్ సినిమాల్లోనే పాత్రలను అనుకరిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో వీడియోలు షేర్ చేస్తుంటాడు.
ఇంటర్నెట్ డెస్క్: డేవిడ్ వార్నర్ (david warner).. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా ఐపీఎల్ కప్‌ను అందించాడు. అంతేకాకుండా తెలుగు, హిందీ.. ఇలా భారతీయ సినిమాలకు సంబంధించిన పలు పాత్రలను అనుకరిస్తూ సోషల్ మీడియా వేదికగా రీల్స్ పెట్టి ఇక్కడి అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. అలాగే హిట్ పాటలకు తన కుటుంబంతో కలిసి డ్యాన్సులతో అలరిస్తుంటాడు. దీంతో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix india) అతడికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత తెలుగు సినిమాల్లో నటించాలని కోరింది.
‘‘ఆస్ట్రేలియా టాప్ ఆటగాడు డేవిడ్ వార్నర్ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత.. తెలుగు సినిమాల్లో నటించాలి. ఇదే అతడికి సరైన వేదికగా మేం భావిస్తున్నాం’’ అని నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. దీనికి స్పందించిన డేవిడ్ వార్నర్.. నవ్వుతున్న ఎమోజీలను రీట్వీట్ చేశాడు. ఇటీవల ప్రేక్షకులను బాగా ఆకట్టుకొన్న పుష్ప (Pushpa) సినిమాలోని అల్లు అర్జున్ గెటప్‌తోపాటు డీజే టిల్లూగానూ (dj tillu) డేవిడ్ వార్నర్ వేషధారణతో అభిమానుల మనసును కొల్లగొట్టాడు.
తన కెరీర్‌లోనే వందో టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన డేవిడ్ వార్నర్ మాంచి ఊపు మీదున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వార్నర్ ఆడుతున్నాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం రెండో మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం పది పరుగులకే వార్నర్ పెవిలియన్‌కు చేరాడు. గతంలో చోటు చేసుకొన్న బాల్ టాంపిరింగ్‌కు సంబంధించి ఇటీవల మరోసారి వార్తల్లో నిలిచిన విషయం తెలిసందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్
-
గృహరుణం... తొందరగా తీర్చేద్దాం
-
నేపాలీ షెర్పా ప్రపంచ రికార్డు
-
సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు.. పోలీసు కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశం
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..