Published : 09 Mar 2022 01:17 IST

David Warner : పాక్‌తో టెస్టు మ్యాచ్‌.. ‘భాంగ్రా’ స్టెప్పులేసిన డేవిడ్ వార్నర్

(Photo : PCB Twitter Screen Shot) 

ఇంటర్నెట్ డెస్క్‌ : పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచులో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్ వార్నర్‌ సరదాగా ‘భాంగ్రా’ స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించాడు. ఆ వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ఆ వీడియోను చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వార్నర్‌ ‘భాంగ్రా’ స్టెప్పులను మీరూ చూసేయండి!

ఇదిలా ఉండగా.. పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రా గా ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 476/4 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. పాక్‌ బ్యాటర్లు ఇమామ్‌-ఉల్‌-హక్‌ (157), అజర్‌ అలీ (185) భారీ శతకాలు నమోదు చేశారు. అనంతరం, తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 459 పరుగులకు ఆలౌటైంది. ఆసిస్‌ ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (97), డేవిడ్‌ వార్నర్‌ (68) సహా లబుషేన్‌ (90), స్టీవెన్‌ స్మిత్ (78) అర్ధ శతకాలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 17 పరుగుల ఆధిక్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్‌ (136), ఇమామ్‌-ఉల్-హక్‌ (111) శతకాలతో రాణించడంతో.. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి 252/0 స్కోరుతో నిలిచింది. దీంతో మ్యాచు డ్రాగా ముగిసింది.


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని