Warner : ఫీమేల్‌ పాత్ర అయినా ఓకే.. మరి డేవిడ్‌ వార్నర్‌ తర్వాతి రీల్‌ ఏంటో తెలుసా..?

 సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆటగాళ్లలో డేవిడ్‌ వార్నర్‌ ఒకడు. బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించే వార్నర్‌ తనదైన హావభావాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. తెలుగు, హిందీ  సినిమాలకు..

Published : 13 May 2022 02:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆటగాళ్లలో డేవిడ్‌ వార్నర్‌ ఒకడు. బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించే వార్నర్‌ తనదైన హావభావాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. తెలుగు, హిందీ సినిమాలకు సంబంధించిన డైలాగులు, డ్యాన్స్‌ చేసే రీల్స్‌ను ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటాడు. హైదరాబాద్‌ తరఫున ఆడేటప్పుడు తెలుగు సినిమాల్లోని టాప్‌ హీరోల డైలాగులకు కుటుంబంతో కలిసి హడావుడి చేసేవాడు. ఇప్పుడు దిల్లీ జట్టుకు ఆడుతున్నప్పటికీ పుష్ప సినిమాలోని ‘తగ్గేదేలే’ మేనరిజం వాడుతూ మైదానంలోనూ, సోషల్‌ మీడియాలోనూ అభిమానులను అలరించాడు. ఈ క్రమంలో తర్వాత ఏ సాంగ్‌ను రీక్రియేట్‌ చేస్తున్నావని నిన్న రాజస్థాన్‌తో మ్యాచ్‌ అనంతరం కామెంటేటర్‌ అడిగిన ప్రశ్నకు డేవిడ్‌ భాయ్‌ సమాధానం ఇచ్చాడు. అంతేకాకుండా తనతోపాటు మరో ఇద్దరు క్రికెటర్లు కూడా ఉంటారని వెల్లడించాడు.

‘‘దిల్లీ జట్టులోని సభ్యులు ఇటీవల వచ్చిన తమిళ చిత్రం బీస్ట్‌లోని ‘జోలీ ఓ జింఖానా’ పాటకు డ్యాన్స్‌ వేయమని డ్రెస్సింగ్‌ రూమ్‌లో అడిగారు. అయితే ఇందులో తన పక్కన యువతి పాత్ర వేసేందుకు ఒకరు కావాలి. ఎవరూ ముందుకు రాకపోతే నేనే వేస్తా.  నాకెలాంటి ఇబ్బంది లేదు. నాతోపాటు నాగర్‌కోటి, ఖలీల్‌ అహ్మద్‌ కూడా చేయబోతున్నారు. రాజస్థాన్‌తో మ్యాచ్‌కు దూరమైన ఖలీల్‌కు కాస్త వినోదం అందినట్టూ ఉంటుంది’’ అని డేవిడ్‌ వార్నర్‌ వివరించాడు. ప్రస్తుత టీ20 లీగ్‌ సీజన్‌లో డేవిడ్‌ వార్నర్‌ పది మ్యాచుల్లో 427 పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దిల్లీ 12 మ్యాచులకుగాను ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో దిల్లీ విజయం సాధించాల్సిందే. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని